ఎట్టిజాణలో మీరు ఇటువలె నుండవద్దా
(॥పల్లవి॥)
ఎట్టిజాణలో మీరు ఇటువలె నుండవద్దా
చుట్టపువరుస మిమ్ముఁజూచి నేరవలెను
(॥ఎట్టి॥)
మక్కువగలనీవైతే మాటలాడి తనియవు
దక్కి యాపైతే నూఁకొని తనియదు
ఇక్కడ నందరుఁజూచే రెగ్గుసిగ్గు లెఱఁగరు
చొక్కపువలపు మిమ్ముఁజూచి నేరవలెను
(॥ఎట్టి॥)
ఆసల నీ వాపె చన్ను లంటియంటి యలయవు
సేసి యాపె వూడిగేలచే నలయదు
తాసువలెఁ బెనఁగుచు తలమొల యెఱఁగరు
నూసకపుఁబెండ్లి మిమ్ముఁజూచి నేరవలెను
(॥ఎట్టి॥)
గక్కన శ్రీవేంకటేశ కాఁగిలించి పాయపు
యెక్కువ నాపె నీవురమెక్కి పాయదు
పక్కన నానారతుల పగలురే యెఱఁగరు
చొక్కేటియాసలు మిమ్ముఁజూచి నేరవలెను
(||pallavi||)
ĕṭṭijāṇalo mīru iḍuvalĕ nuṁḍavaddā
suṭṭabuvarusa mimmum̐jūsi neravalĕnu
(||ĕṭṭi||)
makkuvagalanīvaide māḍalāḍi taniyavu
dakki yābaide nūm̐kŏni taniyadu
ikkaḍa naṁdarum̐jūse rĕggusiggu lĕṟam̐garu
sŏkkabuvalabu mimmum̐jūsi neravalĕnu
(||ĕṭṭi||)
āsala nī vābĕ sannu laṁṭiyaṁṭi yalayavu
sesi yābĕ vūḍigelase nalayadu
tāsuvalĕm̐ bĕnam̐gusu talamŏla yĕṟam̐garu
nūsagabum̐bĕṁḍli mimmum̐jūsi neravalĕnu
(||ĕṭṭi||)
gakkana śhrīveṁkaḍeśha kām̐giliṁchi pāyabu
yĕkkuva nābĕ nīvuramĕkki pāyadu
pakkana nānāradula pagalure yĕṟam̐garu
sŏkkeḍiyāsalu mimmum̐jūsi neravalĕnu