Etti vesaalu seyamga vaddu gaaga

ఎట్టి వేసాలు సేయఁగ వద్దు గాక
Language

(॥పల్లవి॥)
ఎట్టి వేసాలు సేయఁగ వద్దు గాక
చుట్టముఁ జేసుక రాఁగా సూడువట్టేనా

(॥॥)
మంతనాన నాతఁడు నా మాట లోని వాఁడంటా
యెంత వుప్పతించేవే యేమే నన్ను
పంతగత్తె వంత యైతే పతిని నీ యింటికే
వంతుకుఁ బిలుచుకోఁగా వద్దనేనా నేను

(॥॥)
చెలరేఁగి యీతఁడు నా చెప్పినట్టు సేసునంటా
చలపట్ట నేలే యేమి సాదించేవే
బలవంతురాల వైతే పైకొని యీతని నీవు
యెలయించి తియ్యఁగా న దేమనేనా నేను

(॥॥)
కందువ నాతఁడు నన్నుఁ గౌఁగిలించుకొనే నంటా
గొంది నుండీ నన్నేఁటికిఁ గొనియాడేవే
యిందరిలో దిట్ట వైతే నిప్పుడు శ్రీ వేంకటేశు
సందుకొని కూడఁ గాను జంకించేనా నేనూ

(||pallavi||)
ĕṭṭi vesālu seyam̐ga vaddu gāga
suṭṭamum̐ jesuga rām̐gā sūḍuvaṭṭenā

(||||)
maṁtanāna nādam̐ḍu nā māḍa loni vām̐ḍaṁṭā
yĕṁta vuppadiṁcheve yeme nannu
paṁtagattĕ vaṁta yaide padini nī yiṁṭige
vaṁtugum̐ bilusugom̐gā vaddanenā nenu

(||||)
sĕlarem̐gi yīdam̐ḍu nā sĕppinaṭṭu sesunaṁṭā
salabaṭṭa nele yemi sādiṁcheve
balavaṁturāla vaide paigŏni yīdani nīvu
yĕlayiṁchi tiyyam̐gā na demanenā nenu

(||||)
kaṁduva nādam̐ḍu nannum̐ gaum̐giliṁchugŏne naṁṭā
gŏṁdi nuṁḍī nannem̐ṭigim̐ gŏniyāḍeve
yiṁdarilo diṭṭa vaide nippuḍu śhrī veṁkaḍeśhu
saṁdugŏni kūḍam̐ gānu jaṁkiṁchenā nenū