ఎట్టి వేగిరికాఁడవు యేమయ్యా నీవు
(॥పల్లవి॥)
ఎట్టి వేగిరికాఁడవు యేమయ్యా నీవు
మిట్టిపడి దయ్యమైనా మెచ్చవద్దా నిన్నును
(॥॥)
చలమరివాఁడవు చనవేల యిచ్చితివి
వలవఁగ నాడేఁ నీవు వద్దన రాదా
యెలయించి వూరివారి నింతసేయ వ్రతమా
నలువంక నింకా నిన్ను నమ్మవద్దా చెలులు
(॥॥)
కడుఁ బంతగాఁడవు కదిసేల నవ్వితివి
తడవకుమని దయ దలఁచ రాదా
పడుచులఁ దెచ్చి యింత వచ్చి సేయఁ దగవా
తొడిఁబడ నిట్టైతే దోసమైనా ముట్టదా
(॥॥)
బిగిసేటి వాఁడవు ప్రియము చెప్పఁగనేల
పగటున నాకె నొడఁబరచ రాదా
నిగిడి శ్రీవేంకటేశ నీవే యీపె నేలితివి
మొగచాటు వలెనా నీమోహమునకుఁ గడమా
(||pallavi||)
ĕṭṭi vegirigām̐ḍavu yemayyā nīvu
miṭṭibaḍi dayyamainā mĕchchavaddā ninnunu
(||||)
salamarivām̐ḍavu sanavela yichchidivi
valavam̐ga nāḍem̐ nīvu vaddana rādā
yĕlayiṁchi vūrivāri niṁtaseya vradamā
naluvaṁka niṁkā ninnu nammavaddā sĕlulu
(||||)
kaḍum̐ baṁtagām̐ḍavu kadisela navvidivi
taḍavagumani daya dalam̐sa rādā
paḍusulam̐ dĕchchi yiṁta vachchi seyam̐ dagavā
tŏḍim̐baḍa niṭṭaide dosamainā muṭṭadā
(||||)
bigiseḍi vām̐ḍavu priyamu sĕppam̐ganela
pagaḍuna nāgĕ nŏḍam̐barasa rādā
nigiḍi śhrīveṁkaḍeśha nīve yībĕ nelidivi
mŏgasāḍu valĕnā nīmohamunagum̐ gaḍamā