ఎట్టి పరవశమో యెటువంటి తమకమో
(॥పల్లవి॥)
ఎట్టి పరవశమో యెటువంటి తమకమో
బెట్టి ముఁ(ముం?)జేతిచిలుక పిల్చినా నెఱఁగదు
(॥ఎట్టి॥)
నిన్నుం జూచేపరాకున నెలఁత చన్నులమీంద
సన్నదువ్వటపుకొంగు జారినది యెఱఁగదు
మన్నించి నీవు దనతో మాటలాడేపరాకున
వున్నది నీకొనగోర నొ త్తిన నెఱఁగదు
(॥ఎట్టి॥)
పలుమారు నీతోనవ్వే పరాకునఁ దాఁగట్టిన-
వలిపముచెమట పైవడి నంటు టెఱఁగదు
తలపోఁత నీమీఁదం దగిలినపరాకున
తెలిపి నీవు చెయివట్టి తీసినా నెఱఁగదు
(॥ఎట్టి॥)
నెట్టన శ్రీవేంకటేశ నిన్నుఁ గూడేపరాకున
అట్టె అలమేలుమంగ ఆలయనెఱంగదు
గుట్టునఁ దిరుపతిలో గోవిందరాజవై యుండే-
మట్టుఁ దెలిసి పొందులు మఱవనెఱఁగదు
(||pallavi||)
ĕṭṭi paravaśhamo yĕḍuvaṁṭi tamagamo
bĕṭṭi mum̐(muṁ?)jedisiluga pilsinā nĕṟam̐gadu
(||ĕṭṭi||)
ninnuṁ jūsebarāguna nĕlam̐ta sannulamīṁda
sannaduvvaḍabugŏṁgu jārinadi yĕṟam̐gadu
manniṁchi nīvu danado māḍalāḍebarāguna
vunnadi nīgŏnagora nŏ ttina nĕṟam̐gadu
(||ĕṭṭi||)
palumāru nīdonavve parāgunam̐ dām̐gaṭṭina-
valibamusĕmaḍa paivaḍi naṁṭu ṭĕṟam̐gadu
talabom̐ta nīmīm̐daṁ dagilinabarāguna
tĕlibi nīvu sĕyivaṭṭi tīsinā nĕṟam̐gadu
(||ĕṭṭi||)
nĕṭṭana śhrīveṁkaḍeśha ninnum̐ gūḍebarāguna
aṭṭĕ alamelumaṁga ālayanĕṟaṁgadu
guṭṭunam̐ dirubadilo goviṁdarājavai yuṁḍe-
maṭṭum̐ dĕlisi pŏṁdulu maṟavanĕṟam̐gadu