Etti nomu nomsidivo idivo neebhaagyamu

ఎట్టి నోము నోఁచితివో ఇదివో నీభాగ్యము
Language

(॥పల్లవి॥)
ఎట్టి నోము నోఁచితివో ఇదివో నీభాగ్యము
చుట్టరికము లెల్లాను చూపవమ్మా

(॥ఎట్టి॥)
యెంతబత్తో నీమీఁద నింటికి వచ్చె నతఁడు
చెంతనుండి పూడిగాలు సేయవమ్మా
వంతుకు నీమీఁద నిదె వలపులు చల్లీని
వింతలు సేయక ఇఁక విడెమియ్యవమ్మా

(॥ఎట్టి॥)
యేమివేడుకోకాని యేకదాలు నీతో నాడి
వేమారు సుద్దులడిగీ వినవమ్మా
దోమటిఁ బాదాలు నీతొడలపైఁ జాఁచీని
మోము చూచి వేఁడుకతో మొక్కవమ్మా

(॥ఎట్టి॥)
యేరీతిమన్ననో నేఁడు ఇన్ని చందముల నేలె
చేరి ఇచ్చకములెల్లాఁ జేయవమ్మా
గారవించి నిన్ను శ్రీవేంకటేశుఁడు గరుణించె
కూరిమి నిటువలెనే కూడివుండవమ్మా

(||pallavi||)
ĕṭṭi nomu nom̐sidivo idivo nībhāgyamu
suṭṭarigamu lĕllānu sūbavammā

(||ĕṭṭi||)
yĕṁtabatto nīmīm̐da niṁṭigi vachchĕ nadam̐ḍu
sĕṁtanuṁḍi pūḍigālu seyavammā
vaṁtugu nīmīm̐da nidĕ valabulu sallīni
viṁtalu seyaga im̐ka viḍĕmiyyavammā

(||ĕṭṭi||)
yemiveḍugogāni yegadālu nīdo nāḍi
vemāru suddulaḍigī vinavammā
domaḍim̐ bādālu nīdŏḍalabaim̐ jām̐sīni
momu sūsi vem̐ḍugado mŏkkavammā

(||ĕṭṭi||)
yerīdimannano nem̐ḍu inni saṁdamula nelĕ
seri ichchagamulĕllām̐ jeyavammā
gāraviṁchi ninnu śhrīveṁkaḍeśhum̐ḍu garuṇiṁchĕ
kūrimi niḍuvalĕne kūḍivuṁḍavammā