ఎట్టి మొగమాయకాఁడ వేమని చెప్పుదు నిన్ను
(॥పల్లవి॥)
ఎట్టి మొగమాయకాఁడ వేమని చెప్పుదు నిన్ను
తిట్టవచ్చినట్టి యాపె దీవించె నిదివో
(॥ఎట్టి॥)
జగడించేనంటా వచ్చి సకియ తప్పకచూచి
మొగమోటమున నీకు ముంచి లోనాయ
వొగరునీబాసలు వొప్పగించేనంటా వచ్చి
తగిలి నీమోవితేనె తానాసపడెను
(॥ఎట్టి॥)
వడి జంకించేనంటా వచ్చి నీమాఁటలు విని
నడుమంతరాలనే నవ్వె నిపుడు
కడఁగి చేయి చాఁచ వచ్చి గక్కన నీమన్ననకు
యెడమిచ్చి నీకుఁ జేయెత్తి మొక్కెను
(॥ఎట్టి॥)
కొంగువట్టేనంటా వచ్చి కూరిమి నీప్రియాలకు
కంగుమాని యంతలోనే కాఁగిలించెను
కుంగక శ్రీవేంకటేశ కూడి గోర నూఁదవచ్చి
యెంగిలిమోవిపైఁ గెంపులెల్లా నించుకొనెను
(||pallavi||)
ĕṭṭi mŏgamāyagām̐ḍa vemani sĕppudu ninnu
tiṭṭavachchinaṭṭi yābĕ dīviṁchĕ nidivo
(||ĕṭṭi||)
jagaḍiṁchenaṁṭā vachchi sagiya tappagasūsi
mŏgamoḍamuna nīgu muṁchi lonāya
vŏgarunībāsalu vŏppagiṁchenaṁṭā vachchi
tagili nīmovidenĕ tānāsabaḍĕnu
(||ĕṭṭi||)
vaḍi jaṁkiṁchenaṁṭā vachchi nīmām̐ṭalu vini
naḍumaṁtarālane navvĕ nibuḍu
kaḍam̐gi seyi sām̐sa vachchi gakkana nīmannanagu
yĕḍamichchi nīgum̐ jeyĕtti mŏkkĕnu
(||ĕṭṭi||)
kŏṁguvaṭṭenaṁṭā vachchi kūrimi nīpriyālagu
kaṁgumāni yaṁtalone kām̐giliṁchĕnu
kuṁgaga śhrīveṁkaḍeśha kūḍi gora nūm̐davachchi
yĕṁgilimovibaim̐ gĕṁpulĕllā niṁchugŏnĕnu