Etti devaravu neevu yemtadivaamdavu mari

ఎట్టి దేవరవు నీవు యెంతటివాఁడవు మరి
Language

(॥పల్లవి॥)
ఎట్టి దేవరవు నీవు యెంతటివాఁడవు మరి
యిట్టె మమ్ము నీవిఁక యేల తడవేవు

(॥ఎట్టి॥)
మచ్చరాలులేనివారి మాఁటలెల్లాఁ జక్కనే
యిచ్చగించి వినేవారి యింపు చక్కన
ముచ్చటలెనసినట్టి మోహమెల్లాఁ జక్కనే
యెచ్చినమా చక్కఁదనా లేల పొగడేవు

(॥ఎట్టి॥)
చనవు గలుగువారి చందాలెల్లాఁ జవులే
ననుపుగలుగుచోట నవ్వు చవులు
పెనఁగనేర్చిన చోటి బిగువెల్లాఁ జవులే
యెనసి మామోవి చవులేల యడిగేవు

(॥ఎట్టి॥)
ఆయాలు సోఁకినవారి ఆసలెల్లా మంచివే
పాయపువారలచేపట్టు మంచిది
వేయిటికి నన్నును శ్రీ వేంకటేశ కూడితివి
నీయెడ మామంచితనా లేమి చెప్పే దయ్యా

(||pallavi||)
ĕṭṭi devaravu nīvu yĕṁtaḍivām̐ḍavu mari
yiṭṭĕ mammu nīvim̐ka yela taḍavevu

(||ĕṭṭi||)
machcharālulenivāri mām̐ṭalĕllām̐ jakkane
yichchagiṁchi vinevāri yiṁpu sakkana
muchchaḍalĕnasinaṭṭi mohamĕllām̐ jakkane
yĕchchinamā sakkam̐danā lela pŏgaḍevu

(||ĕṭṭi||)
sanavu galuguvāri saṁdālĕllām̐ javule
nanubugalugusoḍa navvu savulu
pĕnam̐ganersina soḍi biguvĕllām̐ javule
yĕnasi māmovi savulela yaḍigevu

(||ĕṭṭi||)
āyālu som̐kinavāri āsalĕllā maṁchive
pāyabuvāralasebaṭṭu maṁchidi
veyiḍigi nannunu śhrī veṁkaḍeśha kūḍidivi
nīyĕḍa māmaṁchidanā lemi sĕppe dayyā