Etti baalumdu puttene yashoda neegu

ఎట్టి బాలుఁడు పుట్టెనే యశోద నీకు
Language

(॥పల్లవి॥)
ఎట్టి బాలుఁడు పుట్టెనే యశోద నీకు
వుట్టిపడీ నింతలేసి కోపనమ్మ నేను

(॥ఎట్టి॥)
సారెఁ జంకనిడుకొంటే చన్నులకే చెయి చాఁచీ
నీరీతి వీనినెత్తుకోనిందుకే నేను
కోరి తొడలపైనిడుకొని బాల్పోయఁగా నవ్వీ
ఆరసి వీనిదగ్గరనందుకే నేను

(॥ఎట్టి॥)
ముద్దుపెట్టుకొనఁబోతే ముంగురులు చుట్టి పట్ట
వొద్దికి రాసయించదు ఓయమ్మ నేను
గద్దించి చెక్కునొక్కితే కాఁగలించి విడువఁడు
చద్దివేఁడి వీనిపొందు చాలు(ల?) నమ్మ నేను

(॥ఎట్టి॥)
అప్పలప్పలనఁబోతే నంగమెల్లా మరపంచీ
ఇప్పుడేమి సేకొంటినిస్సీ నేను
అప్పఁడు శ్రీ వెంకటేశుఁడన్నీఁ దానె యెరుఁగు
చిప్పిలి యాచేఁతలెఁ జెప్పఁజాల నేను

(||pallavi||)
ĕṭṭi bālum̐ḍu puṭṭĕne yaśhoda nīgu
vuṭṭibaḍī niṁtalesi kobanamma nenu

(||ĕṭṭi||)
sārĕm̐ jaṁkaniḍugŏṁṭe sannulage sĕyi sām̐sī
nīrīdi vīninĕttugoniṁduge nenu
kori tŏḍalabainiḍugŏni bālboyam̐gā navvī
ārasi vīnidaggaranaṁduge nenu

(||ĕṭṭi||)
muddubĕṭṭugŏnam̐bode muṁgurulu suṭṭi paṭṭa
vŏddigi rāsayiṁchadu oyamma nenu
gaddiṁchi sĕkkunŏkkide kām̐galiṁchi viḍuvam̐ḍu
saddivem̐ḍi vīnibŏṁdu sālu(la?) namma nenu

(||ĕṭṭi||)
appalappalanam̐bode naṁgamĕllā marabaṁchī
ippuḍemi segŏṁṭinissī nenu
appam̐ḍu śhrī vĕṁkaḍeśhum̐ḍannīm̐ dānĕ yĕrum̐gu
sippili yāsem̐talĕm̐ jĕppam̐jāla nenu