ఎట్టై(ట్ట?)యినా మేలే ఇన్నిటికిఁ దానె గురి
(॥పల్లవి॥)
ఎట్టై(ట్ట?)యినా మేలే ఇన్నిటికిఁ దానె గురి
ముట్టినది నాకుఁ దనమోహమొకటే
(॥॥)
కోపగించి చూచేవి కూరిమి పైఁ జల్లేవి
కై పుగా నీతనిరెండుకన్నులే కదే
తీపు గడుఁబూసేవి తెగి చేఁదు నెరుపేవి
మూపుదాఁకా తనతోడిమాటలే కదే
(॥॥)
అంగపుఁగాఁక రేఁచేవి ఆయములు గరఁచేవి
పొంగారి తాఁజేసేపొందులే కదే
ముంగిటఁగడు నవ్వించేవి మోము గడువంపించేవి
చెంగటఁదాఁ జేసినట్టిచేఁతలేకదే
(॥॥)
మొక్కులు దా మొక్కేవి మొనగోరు మోపేవి
చిక్కనికాఁగిటి తనచేతులేకదే
యిక్కడ శ్రీ వేంకటేశుఁ డింతసేసి నన్నుఁగూడె
దక్కె మాకు నిద్దరికి తలపోఁతేకదే
(||pallavi||)
ĕṭṭai(ṭṭa?)yinā mele inniḍigim̐ dānĕ guri
muṭṭinadi nāgum̐ danamohamŏgaḍe
(||||)
kobagiṁchi sūsevi kūrimi paim̐ jallevi
kai pugā nīdanirĕṁḍugannule kade
tību gaḍum̐būsevi tĕgi sem̐du nĕrubevi
mūbudām̐kā tanadoḍimāḍale kade
(||||)
aṁgabum̐gām̐ka rem̐sevi āyamulu garam̐sevi
pŏṁgāri tām̐jesebŏṁdule kade
muṁgiḍam̐gaḍu navviṁchevi momu gaḍuvaṁpiṁchevi
sĕṁgaḍam̐dām̐ jesinaṭṭisem̐talegade
(||||)
mŏkkulu dā mŏkkevi mŏnagoru mobevi
sikkanigām̐giḍi tanasedulegade
yikkaḍa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtasesi nannum̐gūḍĕ
dakkĕ māgu niddarigi talabom̐tegade