ఎట్టైనా దయదలఁచి యేలుకోవయ్యా
(॥పల్లవి॥)
ఎట్టైనా దయదలఁచి యేలుకోవయ్యా
జట్టిగొని నిన్ను నంత సాదించనేరను
(॥ఎట్టైనా॥)
మన్నింతువనెడి నిండు మందెమేళమునను
యెన్నిమాటలాడితినో యెరఁగను
కన్నియఁ గనక నీతో కందువలుచూపి మోపి
విన్నపాలు చేసుకొను వివరము నేరను
(॥ఎట్టైనా॥)
కైవసమై నీవుండిన గబ్బితనమునను
యేవూడిగము గొరతో యెఱుఁగను
దేవులఁ గనక నీవు దిమ్మరివాఁడవని
భావించి కరకరించి బాసగొననేరను
(॥ఎట్టైనా॥)
దోమటి దొడికినట్టి దొరతనమునను
యేమి నావొళ్ళఁ దప్పులో యెఱఁగను
కామినిఁ గనక శ్రీవేంకటేశ నిన్నుఁగూడి
ఆముక వుందాన నిన్ను నవుఁగాదననేరను
(||pallavi||)
ĕṭṭainā dayadalam̐si yelugovayyā
jaṭṭigŏni ninnu naṁta sādiṁchaneranu
(||ĕṭṭainā||)
manniṁtuvanĕḍi niṁḍu maṁdĕmeḽamunanu
yĕnnimāḍalāḍidino yĕram̐ganu
kanniyam̐ ganaga nīdo kaṁduvalusūbi mobi
vinnabālu sesugŏnu vivaramu neranu
(||ĕṭṭainā||)
kaivasamai nīvuṁḍina gabbidanamunanu
yevūḍigamu gŏrado yĕṟum̐ganu
devulam̐ ganaga nīvu dimmarivām̐ḍavani
bhāviṁchi karagariṁchi bāsagŏnaneranu
(||ĕṭṭainā||)
domaḍi dŏḍiginaṭṭi dŏradanamunanu
yemi nāvŏḽḽam̐ dappulo yĕṟam̐ganu
kāminim̐ ganaga śhrīveṁkaḍeśha ninnum̐gūḍi
āmuga vuṁdāna ninnu navum̐gādananeranu