Esemta kesemta yimduge po veragayyee

ఏచేఁత కేచేఁత యిందుకే పో వెరగయ్యీ
Language

(॥పల్లవి॥)
ఏచేఁత కేచేఁత యిందుకే పో వెరగయ్యీ
చేచేతఁ బెనగేవు చెక్కునొక్కఁగాను

(॥ఏచే॥)
పెదవులనే గొణఁగి బెట్టి తిట్టే విదియేమే
చెదరక నే నీకు చేత మొక్కఁగా
కదలుఁగన్నులఁ జూచి కసరే విదియేమే
యెదుట నీ కాకుచుట్టియీరాఁగానొ

(॥ఏచే॥)
మచ్చరమే పచరించి మారుమోమయ్యేవేమే
విచ్చనవిడి సురటి వినరఁగాను
కొచ్చికొచ్చి ముక్కుననే కోపగించే విదియేమే
యిచ్చగా నెరులఁ జిక్కు లిటు దిద్దఁగాను

(॥ఏచే॥)
నవ్వినవ్వి జగడాలు నటియించే విదియేమే
పువ్వుఁబానుపున నిన్నుఁ బొరుగఁగను
యివ్వలనే శ్రీవేంకటేశుండ నేఁ గూడితిని
అవ్వల మైమఱచేవే అధరిమీఁగాను

(||pallavi||)
esem̐ta kesem̐ta yiṁduge po vĕragayyī
sesedam̐ bĕnagevu sĕkkunŏkkam̐gānu

(||ese||)
pĕdavulane gŏṇam̐gi bĕṭṭi tiṭṭe vidiyeme
sĕdaraga ne nīgu seda mŏkkam̐gā
kadalum̐gannulam̐ jūsi kasare vidiyeme
yĕduḍa nī kāgusuṭṭiyīrām̐gānŏ

(||ese||)
machcharame pasariṁchi mārumomayyeveme
vichchanaviḍi suraḍi vinaram̐gānu
kŏchchigŏchchi mukkunane kobagiṁche vidiyeme
yichchagā nĕrulam̐ jikku liḍu diddam̐gānu

(||ese||)
navvinavvi jagaḍālu naḍiyiṁche vidiyeme
puvvum̐bānubuna ninnum̐ bŏrugam̐ganu
yivvalane śhrīveṁkaḍeśhuṁḍa nem̐ gūḍidini
avvala maimaṟaseve adharimīm̐gānu