ఎఱుఁగుకోలేని జీవి యెడ్డగాక
(॥పల్లవి॥)
ఎఱుఁగుకోలేని జీవి యెడ్డగాక
గుఱి నెంతయినాఁ గోఁతికొమ్ము దప్పఁ బారునా
(॥ఎఱుఁగు॥)
దగ్గర నుండిన మాయఁ దలపించుఁ గాని మది
తగ్గి దవ్వుల జ్ఞానము తడవనీదు
కగ్గు లేక గుల్ల గుల్లె కాక మరి రాయవునా
అగ్గమై తవుడుదిండి కడబాల లేల
(॥ఎఱుఁగు॥)
మక్కువ భోగములనే మరిగించుఁ గాని మేను
అక్కజపు వైరాగ్య మంద నియ్యదు
చిక్కి విత్తొకటి వెట్ట చెట్టొకటి మొలచునా
అక్కర చానపి చవి అడుగ నేమున్నది
(॥ఎఱుఁగు॥)
శ్రీ వేంకటేశు పంపున చిక్కించుఁ గాని కర్మము
దావతి ఆతని యాజ్ఞ దాఁట నియ్యదు
భావింప కాయ పండేలౌ పండు కాయయేలవును
వావిరి ముందికి మరివాడి వెట్టవలెనా
(||pallavi||)
ĕṟum̐gugoleni jīvi yĕḍḍagāga
guṟi nĕṁtayinām̐ gom̐tigŏmmu dappam̐ bārunā
(||ĕṟum̐gu||)
daggara nuṁḍina māyam̐ dalabiṁchum̐ gāni madi
taggi davvula jñānamu taḍavanīdu
kaggu lega gulla gullĕ kāga mari rāyavunā
aggamai tavuḍudiṁḍi kaḍabāla lela
(||ĕṟum̐gu||)
makkuva bhogamulane marigiṁchum̐ gāni menu
akkajabu vairāgya maṁda niyyadu
sikki vittŏgaḍi vĕṭṭa sĕṭṭŏgaḍi mŏlasunā
akkara sānabi savi aḍuga nemunnadi
(||ĕṟum̐gu||)
śhrī veṁkaḍeśhu paṁpuna sikkiṁchum̐ gāni karmamu
dāvadi ādani yājña dām̐ṭa niyyadu
bhāviṁpa kāya paṁḍelau paṁḍu kāyayelavunu
vāviri muṁdigi marivāḍi vĕṭṭavalĕnā