ఎఱుఁగుదుఁ జెప్పవే నీ కితవరిదాన నేను
(॥పల్లవి॥)
ఎఱుఁగుదుఁ జెప్పవే నీ కితవరిదాన నేను
నెఱయా నీ సుద్దు లివి నిన్ననే వింటిని
(॥ఎఱఁ॥)
మనుసులో తమకము మాఁటలోనే కానవచ్చు
కనుచూపులోనే యాసగానవచ్చును
మునుకొన్న రతికళ మోములోనే కానవచ్చు
యెనసిన పతి పొందు లేల దాఁడేవే
(॥ఎఱఁ॥)
నిబ్బరపు వలపులు నిలువునఁ గానవచ్చు
గుబ్బలపైఁ గానవచ్చు గురుతులెల్లా
వుబ్బరిసంతోసాలు వుల్లసానఁ గానవచ్చు
అబ్బురపు నీ పొందు లడఁచనేమిటికే
(॥ఎఱఁ॥)
సెలవుల నవ్వులోనే చేఁతలెల్లాఁ గానవచ్చు
సొలపులఁ గానవచ్చు చుట్టరికము
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె
కలిగిన నీపొందులు కప్పి పెట్ట వలదే
(||pallavi||)
ĕṟum̐gudum̐ jĕppave nī kidavaridāna nenu
nĕṟayā nī suddu livi ninnane viṁṭini
(||ĕṟam̐||)
manusulo tamagamu mām̐ṭalone kānavachchu
kanusūbulone yāsagānavachchunu
munugŏnna radigaḽa momulone kānavachchu
yĕnasina padi pŏṁdu lela dām̐ḍeve
(||ĕṟam̐||)
nibbarabu valabulu niluvunam̐ gānavachchu
gubbalabaim̐ gānavachchu gurudulĕllā
vubbarisaṁtosālu vullasānam̐ gānavachchu
abburabu nī pŏṁdu laḍam̐sanemiḍige
(||ĕṟam̐||)
sĕlavula navvulone sem̐talĕllām̐ gānavachchu
sŏlabulam̐ gānavachchu suṭṭarigamu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
kaligina nībŏṁdulu kappi pĕṭṭa valade