ఎఱుఁగుదు నీమనసు ఇంతా నేను
(॥పల్లవి॥)
ఎఱుఁగుదు నీమనసు ఇంతా నేను
జఱయ కానతీవయ్యా చలములు సేయక
(॥॥)
యేమేమి సేవసేసెనో యేకతాన నీకుఁ జెలి
ఆముకొని బాఁతిపడే వందుకే నీవు
చేముంచి అందుకంటెఁ జేసే నే నూడిగము
కామించి యానతీవయ్యా కడమలు వెట్టక
(॥॥)
యేరీతి మొక్కుకొనెనో ఇచ్చకము సేసి యాకె
కోరి అవే తలఁచేవు కొంకక నీవు
సారె నాలాగుననే వేసారక నేఁ బెనఁగేను
నేరుపవయ్యా నాకు నీవే అన్నియును
(॥॥)
యెటువలెఁ గూడెనో ఇట్టె యలమేలుమంగ
తటుకున నవ్వేవు దానికే నీవు
ఘటన శ్రీ వేంకటేశ కైకొంటి నిన్నట్లానే
గుటుకల మోనీవయ్యా కొసరుగా నీవు
(||pallavi||)
ĕṟum̐gudu nīmanasu iṁtā nenu
jaṟaya kānadīvayyā salamulu seyaga
(||||)
yememi sevasesĕno yegadāna nīgum̐ jĕli
āmugŏni bām̐tibaḍe vaṁduge nīvu
semuṁchi aṁdugaṁṭĕm̐ jese ne nūḍigamu
kāmiṁchi yānadīvayyā kaḍamalu vĕṭṭaga
(||||)
yerīdi mŏkkugŏnĕno ichchagamu sesi yāgĕ
kori ave talam̐sevu kŏṁkaga nīvu
sārĕ nālāgunane vesāraga nem̐ bĕnam̐genu
nerubavayyā nāgu nīve anniyunu
(||||)
yĕḍuvalĕm̐ gūḍĕno iṭṭĕ yalamelumaṁga
taḍuguna navvevu dānige nīvu
ghaḍana śhrī veṁkaḍeśha kaigŏṁṭi ninnaṭlāne
guḍugala monīvayyā kŏsarugā nīvu