ఎఱుఁగుదు నీగుణములేల చెప్పేవు
(॥పల్లవి॥)
ఎఱుఁగుదు నీగుణములేల చెప్పేవు
మఱఁగైనట్టే వుండు మర్మములు సోఁకును
(॥ఎఱు॥)
పన్ని నీవెంతేసి మాతోఁ బంతములాడినా నాపెఁ
గన్నులఁ జూచితే నీకుఁ గళ రేఁగును
యెన్నఁగ నే గుట్టుతో నెంత వోరుచుకుండినా
సన్న లాపె సేసితే సారెఁ దమివుట్టును
(॥ఎఱు॥)
చెలరేఁగి నీలోన సిగ్గులెంత నెఱపినా
లలి నాపె నవ్వితే నెలకొను నాస
చలపట్టుకొని రాజసమున నూరకుండినా
వెలలేని వేడుకలు వెల్లవిరిసేసును
(॥ఎఱు॥)
వట్టిసటలకు నీవు వలపులు దాఁచినాను
గట్టిమాఁట లాపేడితేఁ గాయ మలరు
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చుట్టరిక మెంచితేనే సొంపులెల్లాఁ గలుగు
(||pallavi||)
ĕṟum̐gudu nīguṇamulela sĕppevu
maṟam̐gainaṭṭe vuṁḍu marmamulu som̐kunu
(||ĕṟu||)
panni nīvĕṁtesi mādom̐ baṁtamulāḍinā nābĕm̐
gannulam̐ jūside nīgum̐ gaḽa rem̐gunu
yĕnnam̐ga ne guṭṭudo nĕṁta vorusuguṁḍinā
sanna lābĕ seside sārĕm̐ damivuṭṭunu
(||ĕṟu||)
sĕlarem̐gi nīlona siggulĕṁta nĕṟabinā
lali nābĕ navvide nĕlagŏnu nāsa
salabaṭṭugŏni rājasamuna nūraguṁḍinā
vĕlaleni veḍugalu vĕllavirisesunu
(||ĕṟu||)
vaṭṭisaḍalagu nīvu valabulu dām̐sinānu
gaṭṭimām̐ṭa lābeḍidem̐ gāya malaru
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
suṭṭariga mĕṁchidene sŏṁpulĕllām̐ galugu