Eṟumgudu ne neemoha mimtim bilusugoraadaa

ఎఱుఁగుదు నే నీమోహ మింతిఁ బిలుచుకోరాదా
Language

(॥పల్లవి॥)
ఎఱుఁగుదు నే నీమోహ మింతిఁ బిలుచుకోరాదా
మొఱఁగి వేసా లింత నాముందర నేఁటికి

(॥ఎఱు॥)
వెలఁదిమాటలు నీకు విన వింపులౌఁగాని
చలముతోడుత మొగచాటు గాదు
తలకొని మొక్కితేను దయ వుట్టుఁగాని మరి
యెలమిఁ బరాకుసేయ నెంతైనా గొలుపదు

(॥ఎఱు॥)
ఆపెనవ్విననవ్వులు అందములై యుండుఁగాని
రాపుల నెగసక్కేలై రచ్చకెక్కెవు
చూపులఁ దరితీపులు సోద్యములై తోఁచుఁగాని
కైపులై యెంతైనాను కడుఁ జప్పఁగావు

(॥ఎఱు॥)
నీదేవులు చెనకితే నేరుపులై మించుఁగాని
ఆదిగొని వేసటలై యలపు గాదు
యీదెస శ్రీవేంకటేశ యిటు నన్ను నేలితివి
పోది నెంతైనా తనపొం దెప్పుడు వీడదు

(||pallavi||)
ĕṟum̐gudu ne nīmoha miṁtim̐ bilusugorādā
mŏṟam̐gi vesā liṁta nāmuṁdara nem̐ṭigi

(||ĕṟu||)
vĕlam̐dimāḍalu nīgu vina viṁpulaum̐gāni
salamudoḍuda mŏgasāḍu gādu
talagŏni mŏkkidenu daya vuṭṭum̐gāni mari
yĕlamim̐ barāguseya nĕṁtainā gŏlubadu

(||ĕṟu||)
ābĕnavvinanavvulu aṁdamulai yuṁḍum̐gāni
rābula nĕgasakkelai rachchagĕkkĕvu
sūbulam̐ daridībulu sodyamulai tom̐sum̐gāni
kaibulai yĕṁtainānu kaḍum̐ jappam̐gāvu

(||ĕṟu||)
nīdevulu sĕnagide nerubulai miṁchum̐gāni
ādigŏni vesaḍalai yalabu gādu
yīdĕsa śhrīveṁkaḍeśha yiḍu nannu nelidivi
podi nĕṁtainā tanabŏṁ dĕppuḍu vīḍadu