ఎఱుఁగుదు మిన్నియును ఇంతే శేల
(॥పల్లవి॥)
ఎఱుఁగుదు మిన్నియును ఇంతే శేల
వఱవాతా నింకా నింతవారమా నేము
(॥ఎఱుఁ॥)
మాటలనే చొక్కితిమి మంతనాలు మెచ్చితిమి
తాఁటలఁదూఁటలచేతఁ దనిసితిమి
యేఁటికి మమ్ముఁ జెనకీ నిన్నిటాఁ జుట్టాలము
వాఁటముగ నిఁక వింతవారమా నేము
(॥ఎఱుఁ॥)
నగవుల నలసితిమి నయముల నమ్మితిమి
తగవులు నెరపఁగాఁ దనిసితిమి
మొగము లేమిచూచీని మోహించినవారము
వగలేల యింకా వింతవారమా నేము
(॥ఎఱుఁ॥)
మోవితేనె లానితిమి ముచ్చటలఁ గూడితిమి
తావుల సరసములఁదనిసితిమి
యేవల్లా శ్రీవేంకటేశు కిచ్చకపుసతులము
వావిగూడె నింకా వింతవారమా నేము
(||pallavi||)
ĕṟum̐gudu minniyunu iṁte śhela
vaṟavādā niṁkā niṁtavāramā nemu
(||ĕṟum̐||)
māḍalane sŏkkidimi maṁtanālu mĕchchidimi
tām̐ṭalam̐dūm̐ṭalasedam̐ danisidimi
yem̐ṭigi mammum̐ jĕnagī ninniḍām̐ juṭṭālamu
vām̐ṭamuga nim̐ka viṁtavāramā nemu
(||ĕṟum̐||)
nagavula nalasidimi nayamula nammidimi
tagavulu nĕrabam̐gām̐ danisidimi
mŏgamu lemisūsīni mohiṁchinavāramu
vagalela yiṁkā viṁtavāramā nemu
(||ĕṟum̐||)
movidenĕ lānidimi muchchaḍalam̐ gūḍidimi
tāvula sarasamulam̐danisidimi
yevallā śhrīveṁkaḍeśhu kichchagabusadulamu
vāvigūḍĕ niṁkā viṁtavāramā nemu