(॥పల్లవి॥)
ఎఱుఁగుదు మిందరము నీ వలపు
తర(ఱ?)గరితనముతో దాఁచనేమిటికే
(॥ఎఱు॥)
జొబ్బిలుఁ జెమటలతో సోనగారీ నీవలపు
నిబ్బరపుటూర్పుల నిండీ వలపు
వుబ్బరిపులకలచే వుట్టిపడీ నీవలపు
అబ్బురపుపతితోడ నలుగనేమిటికే
(॥ఎఱు॥)
జాఱెడితురుముతోడ సందడించీ నీవలపు
మీఱినరతుల మితిమీఱి నీవలపు
ఆఱడికాఁకలతోడి ఆయాలురేఁగీ వలపు
చూఱలుగా నితనికి చూపిచెప్పనేఁటికే
(॥ఎఱు॥)
వేడుకచూపులతోడ వేళగాచీ నీవలపు
వూడిగెపుచేఁతల కోగ్గీ వలపు
కూడె శ్రీవేంకటేశుఁడు గొబ్బున ని న్నంతలోనె
మోడామోడిసిగ్గుల మూసిపెట్టనేఁటికే
(||pallavi||)
ĕṟum̐gudu miṁdaramu nī valabu
tara(ṟa?)garidanamudo dām̐sanemiḍige
(||ĕṟu||)
jŏbbilum̐ jĕmaḍalado sonagārī nīvalabu
nibbarabuḍūrbula niṁḍī valabu
vubbaribulagalase vuṭṭibaḍī nīvalabu
abburabubadidoḍa naluganemiḍige
(||ĕṟu||)
jāṟĕḍidurumudoḍa saṁdaḍiṁchī nīvalabu
mīṟinaradula midimīṟi nīvalabu
āṟaḍigām̐kaladoḍi āyālurem̐gī valabu
sūṟalugā nidanigi sūbisĕppanem̐ṭige
(||ĕṟu||)
veḍugasūbuladoḍa veḽagāsī nīvalabu
vūḍigĕbusem̐tala koggī valabu
kūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu gŏbbuna ni nnaṁtalonĕ
moḍāmoḍisiggula mūsibĕṭṭanem̐ṭige