Eṟumgudu manniyunu yela maagum joobevu

ఎఱుఁగుదు మన్నియును యేల మాకుఁ జూపేవు
Language

(॥పల్లవి॥)
ఎఱుఁగుదు మన్నియును యేల మాకుఁ జూపేవు
మఱి నీవేమి సేసినా మారుమాట లాడేనా

(॥॥)
మొగమిచ్చమాటలు మోరతోపు తనములు
నిగిడి తొల్లే నీవు సేరిచినవి
యెగసక్కెపు నవ్వులు యెడలేని వినయాలు
వెగటుగా చిన్నివాఁడే వెన్నతోఁ బెట్టినవి

(॥॥)
కడు వట్టి సరసాలు కడగండ్ల చూపులు
యెడనెడ నీకు దయ్యమిచ్చినవి
జడిగొన్న యానలును సందుకొన్న చనవుల
పొడవకుండ వీవు పుట్టిగాఁ బుట్టినవి

(॥॥)
తక్కరి పిలుపులును తనియని రతులును
గక్కున నీవు వొడిగట్టినవి
గుక్కక శ్రీవేంకటాద్రి గోవిందరాజ నన్నేలి
అక్కర దీర్చితి విది అచ్చము నీకై నది

(||pallavi||)
ĕṟum̐gudu manniyunu yela māgum̐ jūbevu
maṟi nīvemi sesinā mārumāḍa lāḍenā

(||||)
mŏgamichchamāḍalu moradobu tanamulu
nigiḍi tŏlle nīvu serisinavi
yĕgasakkĕbu navvulu yĕḍaleni vinayālu
vĕgaḍugā sinnivām̐ḍe vĕnnadom̐ bĕṭṭinavi

(||||)
kaḍu vaṭṭi sarasālu kaḍagaṁḍla sūbulu
yĕḍanĕḍa nīgu dayyamichchinavi
jaḍigŏnna yānalunu saṁdugŏnna sanavula
pŏḍavaguṁḍa vīvu puṭṭigām̐ buṭṭinavi

(||||)
takkari pilubulunu taniyani radulunu
gakkuna nīvu vŏḍigaṭṭinavi
gukkaga śhrīveṁkaḍādri goviṁdarāja nanneli
akkara dīrsidi vidi achchamu nīgai nadi