Eṟumgudu mammalaala imta naagum jeppanela

ఎఱుఁగుదు మమ్మలాల ఇంత నాకుఁ జెప్పనేల
Language

(॥పల్లవి॥)
ఎఱుఁగుదు మమ్మలాల ఇంత నాకుఁ జెప్పనేల
తఱవాతి పనులకుఁ దానే కాఁడా

(॥ఎఱు॥)
సొలసి చూచి చూచి చూపులనే చిక్కించి
తలవంచుకొన్నవాఁడు తానే కాఁడా
తొలుతనుండియు మోరతోపులనే తిరిగాడి
తలవాకిటనున్న తానే కాఁడా

(॥ఎఱు॥)
పొగరు గుణాలచేతఁ బొడవెక్కి పొడవెక్కి
తగనికోపాలవాఁడు తానే కాఁడా
బగివాసి కాఁకచేత పరకాంతలను బొందే -
తగవుల ధర్మరాజు తానే కాఁడా

(॥ఎఱు॥)
వుండ నుండ సిగ్గుదేరి వూరఁగలబుద్దులతో
దండిరాతి గుండె వాఁడు తానే కాఁడా
కొండల శ్రీవేంకటాద్రిఁ గోరి నన్నుఁ గూడె
తండినవలపువాఁడు తానే కాఁడా

(||pallavi||)
ĕṟum̐gudu mammalāla iṁta nāgum̐ jĕppanela
taṟavādi panulagum̐ dāne kām̐ḍā

(||ĕṟu||)
sŏlasi sūsi sūsi sūbulane sikkiṁchi
talavaṁchugŏnnavām̐ḍu tāne kām̐ḍā
tŏludanuṁḍiyu moradobulane tirigāḍi
talavāgiḍanunna tāne kām̐ḍā

(||ĕṟu||)
pŏgaru guṇālasedam̐ bŏḍavĕkki pŏḍavĕkki
taganigobālavām̐ḍu tāne kām̐ḍā
bagivāsi kām̐kaseda paragāṁtalanu bŏṁde -
tagavula dharmarāju tāne kām̐ḍā

(||ĕṟu||)
vuṁḍa nuṁḍa sigguderi vūram̐galabuddulado
daṁḍirādi guṁḍĕ vām̐ḍu tāne kām̐ḍā
kŏṁḍala śhrīveṁkaḍādrim̐ gori nannum̐ gūḍĕ
taṁḍinavalabuvām̐ḍu tāne kām̐ḍā