ఎఱుఁగమైతిమయ్య యెట్టయిన నోరుచుకో
(॥పల్లవి॥)
ఎఱుఁగమైతిమయ్య యెట్టయిన నోరుచుకో
గిఱిగొన్న మాచేఁతలు గిలిగింత లవును
(॥ఎఱుఁగ॥)
బత్తితోడనే నీకు పాదము లొత్తఁగఁ బోతే
వొత్తీ నుంగరా లంటా నొడ్డుకొనేవు
చిత్తమురాని సతి సేవలు సేయఁగఁబోతే
హత్తిన రమణునికి నపరాధా లవును
(॥ఎఱుఁగ॥)
నెప్పున వేడుకతోడ నీకు నేఁ గుంచె వేసితే
కొప్పుఁదా కీ వంగె నంటా కొంకి వీఁగీవు
తప్పి యింపుగా నీ చెలి దగ్గరి కొలువఁబోతే
చెప్పరాని నేరములు చేచేతనే అవును
(॥ఎఱుఁగ॥)
కడుఁ దమకాన నిన్ను కౌఁగిలించుకొంటేను
నడుముచన్నులు నిన్ను నాఁటె ననేవు
యెడయక శ్రీవేంకటేశ నే నిన్నుఁ గూడితే
సడియెందునుండో వచ్చి సమరతు లవును
(||pallavi||)
ĕṟum̐gamaidimayya yĕṭṭayina norusugo
giṟigŏnna māsem̐talu giligiṁta lavunu
(||ĕṟum̐ga||)
battidoḍane nīgu pādamu lŏttam̐gam̐ bode
vŏttī nuṁgarā laṁṭā nŏḍḍugŏnevu
sittamurāni sadi sevalu seyam̐gam̐bode
hattina ramaṇunigi nabarādhā lavunu
(||ĕṟum̐ga||)
nĕppuna veḍugadoḍa nīgu nem̐ guṁchĕ veside
kŏppum̐dā kī vaṁgĕ naṁṭā kŏṁki vīm̐gīvu
tappi yiṁpugā nī sĕli daggari kŏluvam̐bode
sĕpparāni neramulu sesedane avunu
(||ĕṟum̐ga||)
kaḍum̐ damagāna ninnu kaum̐giliṁchugŏṁṭenu
naḍumusannulu ninnu nām̐ṭĕ nanevu
yĕḍayaga śhrīveṁkaḍeśha ne ninnum̐ gūḍide
saḍiyĕṁdunuṁḍo vachchi samaradu lavunu