(॥పల్లవి॥)
ఎఱుఁగక నిను సొలసితిఁ గాక
నెఱవు గాజు మాణిక మయ్యీనా
(॥ఎఱుఁగక॥)
మడిదొసకుల నీమాటలనే పో
పడిపడి నడుమిది బడగాయె
విడువిడు నా తోవ సా లేఁటికి
జడిగొను చిలుకలు జక్కవ లౌనా
(॥ఎఱుఁగక॥)
చెనకుల నీ యిటు చేఁతలనే పో
కని కని కన్నులు గనమాయె
చనవులు మనవులుఁచాలు జాలు నిఁక
యిన మినుమే పసిఁడిఁక నయ్యీనా
(॥ఎఱుఁగక॥)
గుటుకల నీరతి కూటమినే పో
కటకట నామై గరుపారె
యిటువలె శ్రీవేంకటేశ కూడితివి
నటనల పులకలు నన లయ్యీనా
(||pallavi||)
ĕṟum̐gaga ninu sŏlasidim̐ gāga
nĕṟavu gāju māṇiga mayyīnā
(||ĕṟum̐gaga||)
maḍidŏsagula nīmāḍalane po
paḍibaḍi naḍumidi baḍagāyĕ
viḍuviḍu nā tova sā lem̐ṭigi
jaḍigŏnu silugalu jakkava launā
(||ĕṟum̐gaga||)
sĕnagula nī yiḍu sem̐talane po
kani kani kannulu ganamāyĕ
sanavulu manavulum̐sālu jālu nim̐ka
yina minume pasim̐ḍim̐ka nayyīnā
(||ĕṟum̐gaga||)
guḍugala nīradi kūḍamine po
kaḍagaḍa nāmai garubārĕ
yiḍuvalĕ śhrīveṁkaḍeśha kūḍidivi
naḍanala pulagalu nana layyīnā