(॥పల్లవి॥)
ఎఱుకో మఱపో యెట్టి కళవళమో
నెఱ జెమటలు చూచి నిజమంటా జొక్కెను
(॥ఎఱుకో॥)
కలలోన దనమోవి గంటి చేసె నని చెలి
తలఁకక పతి దిట్టి తడవి చూచె
నిలువున రమణుడుఁ నీవి వదలించె నని
చిలుకు కుచ్చెలమీద చేయి చా చె నపుడు
(॥ఎఱుకో॥)
ననుపున గలలోన నాయకుఁడు సేసవెట్టె
నని తెలిసి తురుము లంటి చూచెను
కొనబు చన్నులమీద కుంకుమ పూసె నంటా
తనపయ్యెద దెరచి తలపోసి చూచెను
(॥ఎఱుకో॥)
రమణుఁడు కలలోన రతి సేసె నని కని
అమరఁ గౌ గిటిలోన నలమి చూచె
తమి శ్రీవేంకటపతి తా నింతలో విచ్చేసి
కమలాక్షి గూడగాఁను కన్నులు దెఱచెను
(||pallavi||)
ĕṟugo maṟabo yĕṭṭi kaḽavaḽamo
nĕṟa jĕmaḍalu sūsi nijamaṁṭā jŏkkĕnu
(||ĕṟugo||)
kalalona danamovi gaṁṭi sesĕ nani sĕli
talam̐kaga padi diṭṭi taḍavi sūsĕ
niluvuna ramaṇuḍum̐ nīvi vadaliṁchĕ nani
silugu kuchchĕlamīda seyi sā sĕ nabuḍu
(||ĕṟugo||)
nanubuna galalona nāyagum̐ḍu sesavĕṭṭĕ
nani tĕlisi turumu laṁṭi sūsĕnu
kŏnabu sannulamīda kuṁkuma pūsĕ naṁṭā
tanabayyĕda dĕrasi talabosi sūsĕnu
(||ĕṟugo||)
ramaṇum̐ḍu kalalona radi sesĕ nani kani
amaram̐ gau giḍilona nalami sūsĕ
tami śhrīveṁkaḍabadi tā niṁtalo vichchesi
kamalākṣhi gūḍagām̐nu kannulu dĕṟasĕnu