Eṟuganaidi nimdaamkaa nemtido yamtaa numti

ఎఱుగనైతి నిందాఁకా నేఁటిదో యంటా నుంటి
Language

(॥పల్లవి॥)
ఎఱుగనైతి నిందాఁకా నేఁటిదో యంటా నుంటి
నెఱిఁ దొరలనాడీని నేనేమందు నిఁకను

(॥॥)
కొండలలో నెలకొన్న కోన చెన్నరాయఁడిదే
బొండు మల్లెల వేసెనే పూఁచి నన్నును
పండు ముత్తేల సొమ్ములప్పటి నామెడఁ బెట్టి
దుండగము సేసె నేమందు నేనిఁకను

(॥॥)
గొప్పయైన యేటిదరిఁ గోన చెన్న రాయఁడిదే
దప్పికి గప్పురమంపెఁ దరుణిచేత
చెప్పరాని మాటలెల్లాఁ జెవిలోఁ దానే చెప్పి
దుప్పటి గప్పినేమందు నేనిఁకను

(॥॥)
గుఱితో శ్రీవేంకటాద్రి కోన చెన్న రాయఁడిదే
చెఱఁగు వట్టి ప్రియాలు చెప్పికూడెను
జఱయుచు వచ్చి వచ్చి చనవులెల్లా నొసగి
మెఱసి తొరలనాడీ మఱేమందు నిఁకను

(||pallavi||)
ĕṟuganaidi niṁdām̐kā nem̐ṭido yaṁṭā nuṁṭi
nĕṟim̐ dŏralanāḍīni nenemaṁdu nim̐kanu

(||||)
kŏṁḍalalo nĕlagŏnna kona sĕnnarāyam̐ḍide
bŏṁḍu mallĕla vesĕne pūm̐si nannunu
paṁḍu muttela sŏmmulappaḍi nāmĕḍam̐ bĕṭṭi
duṁḍagamu sesĕ nemaṁdu nenim̐kanu

(||||)
gŏppayaina yeḍidarim̐ gona sĕnna rāyam̐ḍide
dappigi gappuramaṁpĕm̐ daruṇiseda
sĕpparāni māḍalĕllām̐ jĕvilom̐ dāne sĕppi
duppaḍi gappinemaṁdu nenim̐kanu

(||||)
guṟido śhrīveṁkaḍādri kona sĕnna rāyam̐ḍide
sĕṟam̐gu vaṭṭi priyālu sĕppigūḍĕnu
jaṟayusu vachchi vachchi sanavulĕllā nŏsagi
mĕṟasi tŏralanāḍī maṟemaṁdu nim̐kanu