ఎఱుకమఱపు లేదా యెవ్వరికైనా
(॥పల్లవి॥)
ఎఱుకమఱపు లేదా యెవ్వరికైనా
వొఱపున నెగ్గు లెంచకుండవలదా
(॥ఎఱుక॥)
నెయ్యమున నిన్నుఁ బాసి నివ్వెఱఁగై వుంటిఁ గాక
అయ్యో నే నీతో మాటలాడ కుందునా
వొయ్యనే నీ వైనా నావొద్దనుండి యీవేళ
పయ్యదపైఁ జేయి వేసి పలికించవలదా
(॥ఎఱుక॥)
వుల్లము దెలియుదాఁకా నూరకే నే నుంటిఁ గాక
చెల్లఁబో నీకుఁ బ్రియము చెప్ప కుందునా
తెల్లమిగా నావెఱపు తెలిపి బుద్దులు చెప్పి
కొల్లలుగా నీవు నన్నుఁ గూడవలదా
(॥ఎఱుక॥)
కూడినపరవశాన గోరికొన దాఁకెఁ గాక
వోడక నీమేన రేక లొనరింతునా
వేడుకతో నపుడే శ్రీవేంకటేశ మరురతి
మేడెములోఁ దప్పించుక మించవలదా
(||pallavi||)
ĕṟugamaṟabu ledā yĕvvarigainā
vŏṟabuna nĕggu lĕṁchaguṁḍavaladā
(||ĕṟuga||)
nĕyyamuna ninnum̐ bāsi nivvĕṟam̐gai vuṁṭim̐ gāga
ayyo ne nīdo māḍalāḍa kuṁdunā
vŏyyane nī vainā nāvŏddanuṁḍi yīveḽa
payyadabaim̐ jeyi vesi paligiṁchavaladā
(||ĕṟuga||)
vullamu dĕliyudām̐kā nūrage ne nuṁṭim̐ gāga
sĕllam̐bo nīgum̐ briyamu sĕppa kuṁdunā
tĕllamigā nāvĕṟabu tĕlibi buddulu sĕppi
kŏllalugā nīvu nannum̐ gūḍavaladā
(||ĕṟuga||)
kūḍinabaravaśhāna gorigŏna dām̐kĕm̐ gāga
voḍaga nīmena rega lŏnariṁtunā
veḍugado nabuḍe śhrīveṁkaḍeśha maruradi
meḍĕmulom̐ dappiṁchuga miṁchavaladā