Eṟuga seppemayya yidigo neegu nemdu

ఎఱుక చెప్పేమయ్య యిదిగో నీకు నేఁడు
Language

(॥పల్లవి॥)
ఎఱుక చెప్పేమయ్య యిదిగో నీకు నేఁడు
మెఱసి నీవు నాకు మేలై వలతువు

(॥ఎఱుక॥)
అలరులకొప్పు నీకు నతిమోహము వుట్టించె
తలిరుమోవి తీపు దప్పిరేఁచెను
వెలిఁజెక్కులకళలు వేడుక పురికొలిపె
కలికి సింగారాలు కన్నులాస నించెను

(॥ఎఱుక॥)
తచ్చిన గుబ్బచన్నులు తమకము రేఁచె నిన్ను
మచ్చికఁ గనుచూపులు మర్మాలు నాఁటె
మెచ్చులుపేరిఁటి వొప్పు మిక్కిలిని భ్రమయించె
నెచ్చెలిచక్కఁదనము నిన్నింత చొక్కించెను

(॥ఎఱుక॥)
వాసనమోవితేనె వంతున నోరూరించె
సేసవెట్టిన చేతులు సిగ్గు దేరిచె
యీసుద్దికి శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
శ్రీసతిమహిమలెల్ల చేచేత మెప్పించెను

(||pallavi||)
ĕṟuga sĕppemayya yidigo nīgu nem̐ḍu
mĕṟasi nīvu nāgu melai valaduvu

(||ĕṟuga||)
alarulagŏppu nīgu nadimohamu vuṭṭiṁchĕ
talirumovi tību dappirem̐sĕnu
vĕlim̐jĕkkulagaḽalu veḍuga purigŏlibĕ
kaligi siṁgārālu kannulāsa niṁchĕnu

(||ĕṟuga||)
tachchina gubbasannulu tamagamu rem̐sĕ ninnu
machchigam̐ ganusūbulu marmālu nām̐ṭĕ
mĕchchuluberim̐ṭi vŏppu mikkilini bhramayiṁchĕ
nĕchchĕlisakkam̐danamu ninniṁta sŏkkiṁchĕnu

(||ĕṟuga||)
vāsanamovidenĕ vaṁtuna norūriṁchĕ
sesavĕṭṭina sedulu siggu derisĕ
yīsuddigi śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
śhrīsadimahimalĕlla seseda mĕppiṁchĕnu