ఏరుపరచి చెప్పరే యింతి చక్కఁదనములు
(॥పల్లవి॥)
ఏరుపరచి చెప్పరే యింతి చక్కఁదనములు
వూరకే యీరెంటికిని నొనరె నీభావము
(॥ఏరు॥)
తుమ్మిదలో నీలాలో తొయ్యలినెరిఁగురులు
పమ్మి యద్దమో చంద్రుఁడో పసనిమోము
వుమ్మడిఁ దిలపుష్పమో వొగి సంపెంగో ముక్కు
కమ్మటిఁ గలువలో గండుమీలో కన్నులు
(॥ఏరు॥)
జక్కనలో నిమ్మపండ్లో జవారాలిచన్నులు
అక్కజపుబయలో సింహమో నడుము
చొక్కపుబిసములో సొంపుఁదీగెలో చేతులు
చక్కనిసుకదిబ్బలో చక్రాలో పిఱుఁదులు
(॥ఏరు॥)
కందున నరఁటులో కరికరాలో తొడలు
చెందమ్ములో చిగురులో జిగిఁబాదాలు
ఇందిరాదేవి శ్రీవేంకటేశువురమున నినదె
కుందణమో మెఱుఁగో నిగ్గుల యీకెమేను
(||pallavi||)
erubarasi sĕppare yiṁti sakkam̐danamulu
vūrage yīrĕṁṭigini nŏnarĕ nībhāvamu
(||eru||)
tummidalo nīlālo tŏyyalinĕrim̐gurulu
pammi yaddamo saṁdrum̐ḍo pasanimomu
vummaḍim̐ dilabuṣhpamo vŏgi saṁpĕṁgo mukku
kammaḍim̐ galuvalo gaṁḍumīlo kannulu
(||eru||)
jakkanalo nimmabaṁḍlo javārālisannulu
akkajabubayalo siṁhamo naḍumu
sŏkkabubisamulo sŏṁpum̐dīgĕlo sedulu
sakkanisugadibbalo sakrālo piṟum̐dulu
(||eru||)
kaṁduna naram̐ṭulo karigarālo tŏḍalu
sĕṁdammulo sigurulo jigim̐bādālu
iṁdirādevi śhrīveṁkaḍeśhuvuramuna ninadĕ
kuṁdaṇamo mĕṟum̐go niggula yīgĕmenu