ఏరుపడె నింతలోనే యిదివో నీనిజమెల్లా
(॥పల్లవి॥)
ఏరుపడె నింతలోనే యిదివో నీనిజమెల్లా
వూరకే బుజ్జగింపుచు నొరసేవు గాక
(॥॥)
అవునయ్య నీగుణాలు ఆడేమంటే నెన్నిలేవు
వువిదలు మొగమోట నున్నారుగాక
తవిలి నవ్వుతా వచ్చి తారుకాణించుమనుచు
కవిసి యేకతమునఁ గదిమేవుగాక
(॥॥)
మేలయ్య మచ్చములు నామేనఁ జూపు నెన్నిలేవు
కోల గాచి పందెమాడఁ గొంకేరు గాక
వేలఁ జూపి యిట్టె వెల్లవిరిగాఁ జేయుమనుచు
చేలకొంగంటుచు నన్నుఁ జెనకేవు గాక
(॥॥)
కానీవయ్య రతులు వింగడించఁగ నెన్నిలేవు
ఆనందించి నివ్వెరగు లందేరుగాక
మోనాన శ్రీవేంకటేశ మొక్కుచు మెచ్చుమనుచు
గోనాలగొందుల నన్నుఁ గూడేవు గాక
(||pallavi||)
erubaḍĕ niṁtalone yidivo nīnijamĕllā
vūrage bujjagiṁpusu nŏrasevu gāga
(||||)
avunayya nīguṇālu āḍemaṁṭe nĕnnilevu
vuvidalu mŏgamoḍa nunnārugāga
tavili navvudā vachchi tārugāṇiṁchumanusu
kavisi yegadamunam̐ gadimevugāga
(||||)
melayya machchamulu nāmenam̐ jūbu nĕnnilevu
kola gāsi paṁdĕmāḍam̐ gŏṁkeru gāga
velam̐ jūbi yiṭṭĕ vĕllavirigām̐ jeyumanusu
selagŏṁgaṁṭusu nannum̐ jĕnagevu gāga
(||||)
kānīvayya radulu viṁgaḍiṁcham̐ga nĕnnilevu
ānaṁdiṁchi nivvĕragu laṁderugāga
monāna śhrīveṁkaḍeśha mŏkkusu mĕchchumanusu
gonālagŏṁdula nannum̐ gūḍevu gāga