(॥పల్లవి॥)
ఎఱిఁగిన పనులకు నింతేలా
కఱతలు నేర్తువు కాంతుఁడ నీవు
(॥ఎఱిఁగి॥)
పన్నినమాయలు పక్కన నుండఁగ
సన్నలు సేసినఁ జమలౌనా
వన్నెల నాతో వలపులు చల్లుచు
కన్నులార్చెదవు కడగడ నీవు
(॥ఎఱిఁగి॥)
చేసిన నేరమి చేచే నుండఁగ
సేసలు వెట్టిన సెలవవునా
బాసలు నాతో పలుమరుఁ జేయుచు
ఆసలు సేసే వవ్వల నీవు
(॥ఎఱిఁగి॥)
కలసిన గుఱుతులు కాఁగిట నుండఁగ
వలవని మఱఁగులు వైపౌనా
యెలమిని శ్రీవేంకటేశ నన్నెనసి
పులకించేవిదె పొరుగున నీవు
(||pallavi||)
ĕṟim̐gina panulagu niṁtelā
kaṟadalu nerduvu kāṁtum̐ḍa nīvu
(||ĕṟim̐gi||)
panninamāyalu pakkana nuṁḍam̐ga
sannalu sesinam̐ jamalaunā
vannĕla nādo valabulu sallusu
kannulārsĕdavu kaḍagaḍa nīvu
(||ĕṟim̐gi||)
sesina nerami sese nuṁḍam̐ga
sesalu vĕṭṭina sĕlavavunā
bāsalu nādo palumarum̐ jeyusu
āsalu sese vavvala nīvu
(||ĕṟim̐gi||)
kalasina guṟudulu kām̐giḍa nuṁḍam̐ga
valavani maṟam̐gulu vaibaunā
yĕlamini śhrīveṁkaḍeśha nannĕnasi
pulagiṁchevidĕ pŏruguna nīvu