ఎఱిఁగిన పనులకు నేల గుట్టు సేసేవు
(॥పల్లవి॥)
ఎఱిఁగిన పనులకు నేల గుట్టు సేసేవు
గుఱిలేని కోరికలు గూఁటఁ బెట్టేవా
(॥॥)
చెలపచెమట గారీఁ జెక్కులను
సెలవుల నవ్వులూరీఁ జెలియకును
పిలిచి మాటాడరాదా ప్రియుఁడవు
వలపులు దాఁచుకొని వడ్డి కిచ్చేవా
(॥॥)
పున్నమవెన్నెల చిందీఁ గన్ను చూపుల
చన్నులఁ బులక లుబ్బీ సకియకు
మన్నించి కూడఁగరాదా మగఁడవు
పిన్నవయసుఁదనము పెట్టెఁ బెట్టేవా
(॥॥)
ముప్పిరిఁదేనెలు జారీ మోవిమీఁ దను
చిప్పిలీఁ గళలవివో చిన్ని మోమున
యిప్పుడె శ్రీ వేంకటేశ యేలితివి
తప్పకుండా రతులు వెదలు వెట్టేవా
(||pallavi||)
ĕṟim̐gina panulagu nela guṭṭu sesevu
guṟileni korigalu gūm̐ṭam̐ bĕṭṭevā
(||||)
sĕlabasĕmaḍa gārīm̐ jĕkkulanu
sĕlavula navvulūrīm̐ jĕliyagunu
pilisi māḍāḍarādā priyum̐ḍavu
valabulu dām̐sugŏni vaḍḍi kichchevā
(||||)
punnamavĕnnĕla siṁdīm̐ gannu sūbula
sannulam̐ bulaga lubbī sagiyagu
manniṁchi kūḍam̐garādā magam̐ḍavu
pinnavayasum̐danamu pĕṭṭĕm̐ bĕṭṭevā
(||||)
muppirim̐denĕlu jārī movimīm̐ danu
sippilīm̐ gaḽalavivo sinni momuna
yippuḍĕ śhrī veṁkaḍeśha yelidivi
tappaguṁḍā radulu vĕdalu vĕṭṭevā