Eṟimgina jaanaladi itti mohamu

ఎఱిఁగిన జాణలది ఇట్టి మోహము
Language

(॥పల్లవి॥)
ఎఱిఁగిన జాణలది ఇట్టి మోహము
మఱవరా దాలికి మగనికి మోహము

(॥ఎఱి॥)
వినయము చేసితేను వెగ్గళించు మోహము
ననుపు చక్కనయితే నాటు మోహము
యెనసినమాటలైతే యీడేరు మోహము
మనసురా మెలఁగితే మాననీదు మోహము

(॥ఎఱి॥)
యేపొద్దుఁ గాచుకుండితే యిరవౌను మోహము
యేపుమీరి పైకొంటే ఇంపు మోహము
కోప మెందు లేకుండితే కొనసాగు మోహము
చూపు నెట్టుకోఁ జూచితే సులభమౌ మోహము

(॥ఎఱి॥)
ఇచ్చకమే నెరపితే నియ్యకోలౌ మోహము
నిచ్చకొత్తగాఁ గూడితే నిండు మోహము
వచ్చి శ్రీవేంకటేశుఁడే వదలక నన్ను నేలె
తచ్చితచ్చి కొసరితే తగులౌను మోహము

(||pallavi||)
ĕṟim̐gina jāṇaladi iṭṭi mohamu
maṟavarā dāligi maganigi mohamu

(||ĕṟi||)
vinayamu sesidenu vĕggaḽiṁchu mohamu
nanubu sakkanayide nāḍu mohamu
yĕnasinamāḍalaide yīḍeru mohamu
manasurā mĕlam̐gide mānanīdu mohamu

(||ĕṟi||)
yebŏddum̐ gāsuguṁḍide yiravaunu mohamu
yebumīri paigŏṁṭe iṁpu mohamu
koba mĕṁdu leguṁḍide kŏnasāgu mohamu
sūbu nĕṭṭugom̐ jūside sulabhamau mohamu

(||ĕṟi||)
ichchagame nĕrabide niyyagolau mohamu
nichchagŏttagām̐ gūḍide niṁḍu mohamu
vachchi śhrīveṁkaḍeśhum̐ḍe vadalaga nannu nelĕ
tachchidachchi kŏsaride tagulaunu mohamu