ఎఱిఁగిన ఆఁటదాని కెగ్గు గాదా
(॥పల్లవి॥)
ఎఱిఁగిన ఆఁటదాని కెగ్గు గాదా
తఱవాతి పనులకు దగ్గరేమా నిన్నును
(॥ఎఱిఁ॥)
కందువమాటలు మీలో కలసి ఆడినమీఁద
యెంద రేమాట లాడినా యెంగిలే కాదా
ముందే నీవు నాపెఁ గూడి మోవులందు కొన్నమీఁద
చెంది తక్కినవారికి మీశేషమే కాదా
(॥ఎఱిఁ॥)
యురవై రాతిరి మీలో నిద్దరు నవ్వినమీఁద
పరులవేగినవ్వులు పాఁచివే కావా
సొరది తగులు మీరు చూపు చూచుకొన్నమీఁద
గరిమ నందరి చూపి కట్టఁగడే కాదా
(॥ఎఱిఁ॥)
గక్కన మీలో మీరు కాఁగిలించుకొన్నమీఁద
దిక్కులవారికాఁగిలి దిగ్గుడే కాదా
వొక్కట శ్రీవేంకటేశ వున్న సుద్ది లేదని
చిక్కి నన్నుఁ గూడితివి సిగ్గాపెదే కాదా
(||pallavi||)
ĕṟim̐gina ām̐ṭadāni kĕggu gādā
taṟavādi panulagu daggaremā ninnunu
(||ĕṟim̐||)
kaṁduvamāḍalu mīlo kalasi āḍinamīm̐da
yĕṁda remāḍa lāḍinā yĕṁgile kādā
muṁde nīvu nābĕm̐ gūḍi movulaṁdu kŏnnamīm̐da
sĕṁdi takkinavārigi mīśheṣhame kādā
(||ĕṟim̐||)
yuravai rādiri mīlo niddaru navvinamīm̐da
parulaveginavvulu pām̐sive kāvā
sŏradi tagulu mīru sūbu sūsugŏnnamīm̐da
garima naṁdari sūbi kaṭṭam̐gaḍe kādā
(||ĕṟim̐||)
gakkana mīlo mīru kām̐giliṁchugŏnnamīm̐da
dikkulavārigām̐gili digguḍe kādā
vŏkkaḍa śhrīveṁkaḍeśha vunna suddi ledani
sikki nannum̐ gūḍidivi siggābĕde kādā