Eṟimgimchee nirumelaa nidivo nee manasu

ఎఱిఁగించీ నిరుమేలా నిదివో నీ మనసు
Language

(॥పల్లవి॥)
ఎఱిఁగించీ నిరుమేలా నిదివో నీ మనసు
గుఱి గాడిపారీని గోవిందరాజా

(॥ఎఱిఁ॥)
కొలువులోపలనున్న కొమ్మలపాటలు వింటా
అలరినీవు పరాకై వుండఁగా
కులికి పాదములొత్తేకొమ్ములు కొనగోళ్ల
యెలమిఁ దమమోహము లెచ్చరించేరు

(॥ఎఱిఁ॥)
యెదుట నాట్యములాడిఇంతులనుఁ జూచుకొంటా
గుదిగొని యట్టె చొక్కు చునుండఁగా
ఇదివో ఆకుమడిచిఇచ్చేసతులుచేతుల
నదిమి తమమీఁదట ఆసలుచూపేవు

(॥ఎఱిఁ॥)
సారె నిన్ను సింగారించేసతులచన్నులు చూచి
చేరి శ్రీవేంకటేశుఁడ చేఇచాఁచఁగా
శ్రీరమణ భూరమణిఁ జెంది నీ కాఁగిటిలోన
పేరడిరతుల నిన్నుఁ బెచ్చు రేఁచేరు

(||pallavi||)
ĕṟim̐giṁchī nirumelā nidivo nī manasu
guṟi gāḍibārīni goviṁdarājā

(||ĕṟim̐||)
kŏluvulobalanunna kŏmmalabāḍalu viṁṭā
alarinīvu parāgai vuṁḍam̐gā
kuligi pādamulŏttegŏmmulu kŏnagoḽla
yĕlamim̐ damamohamu lĕchchariṁcheru

(||ĕṟim̐||)
yĕduḍa nāṭyamulāḍiiṁtulanum̐ jūsugŏṁṭā
gudigŏni yaṭṭĕ sŏkku sunuṁḍam̐gā
idivo āgumaḍisiichchesadulusedula
nadimi tamamīm̐daḍa āsalusūbevu

(||ĕṟim̐||)
sārĕ ninnu siṁgāriṁchesadulasannulu sūsi
seri śhrīveṁkaḍeśhum̐ḍa seisām̐sam̐gā
śhrīramaṇa bhūramaṇim̐ jĕṁdi nī kām̐giḍilona
peraḍiradula ninnum̐ bĕchchu rem̐seru