Eṟimgimchave naagunela daamsevu

ఎఱిఁగించవే నాకునేల దాఁచేవు
Language

(॥పల్లవి॥)
ఎఱిఁగించవే నాకునేల దాఁచేవు
గుఱుతులు గానవచ్చీఁ గొంకనేఁటికే

(॥ఎఱి॥)
కామినిరో నీమోమునఁ గళలుదేరీ నేఁడు
నీమగఁడు వచ్చెనా నీవద్దకి
అముకొని చెంగలించి యట్టె మాటలాడేవు
యేమైనా నీకుఁ జనవులిచ్చెనటవే

(॥ఎఱి॥)
సంతోసించుకొందానవు చవులు చూపి యతఁడు
మంతనాన నిన్నప్పుడె మన్నించెనా
వింతలుగా నెలవుల వేడుకతో నవ్వేవు
యింతలో నీకోరికలు యీడేరిచెనటవే

(॥ఎఱి॥)
వేవేలుచిన్నలతోడ వెల్లవిరై మెఱసేవు
శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ జేరి కూడెనా
యీవేళ నల మేల్‌మంగ విన్నిటాఁ జోక్కే వీతఁడే
చేవమీరినరతులఁ జిమ్మిరేఁచెనటవే

(||pallavi||)
ĕṟim̐giṁchave nāgunela dām̐sevu
guṟudulu gānavachchīm̐ gŏṁkanem̐ṭige

(||ĕṟi||)
kāminiro nīmomunam̐ gaḽaluderī nem̐ḍu
nīmagam̐ḍu vachchĕnā nīvaddagi
amugŏni sĕṁgaliṁchi yaṭṭĕ māḍalāḍevu
yemainā nīgum̐ janavulichchĕnaḍave

(||ĕṟi||)
saṁtosiṁchugŏṁdānavu savulu sūbi yadam̐ḍu
maṁtanāna ninnappuḍĕ manniṁchĕnā
viṁtalugā nĕlavula veḍugado navvevu
yiṁtalo nīgorigalu yīḍerisĕnaḍave

(||ĕṟi||)
vevelusinnaladoḍa vĕllavirai mĕṟasevu
śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri kūḍĕnā
yīveḽa nala mel‌maṁga vinniḍām̐ jokke vīdam̐ḍe
sevamīrinaradulam̐ jimmirem̐sĕnaḍave