ఎఱిఁగించవయ్య నాకునేల దాఁచేవు
(॥పల్లవి॥)
ఎఱిఁగించవయ్య నాకునేల దాఁచేవు
మెఱసి యాపెకు నీకు మేనవావై యున్నది
(॥॥)
ముంగిట మొక్కులు మొక్కి మోహము నీపైఁ జల్లి
చెంగలిచూపులఁ జూచీఁ జెలియ నిన్ను
చెంగటఁ దొల్లిటిపొందో నేసేఇప్పటినేస్తమా
ఇంగితాకారమైతే నిటువలె నున్నది
(॥॥)
సెలవుల నవ్వు నవ్వి సిగ్గుతోఁ దలవంచి
కలువపూవుల వేసీఁ గమ్మటి నిన్ను
చలపట్టి చెనకీనో సలిగ నీవిచ్చితివో
తలఁచుకొంటే మీలో తగుల మిట్లున్నది
(॥॥)
మాఁగినమోవి చూపి మఱఁగున సన్న సేసి
కాఁగిటింలించుకొనీ శ్రీ వేంకటేశ నిన్ను
దాఁగక యలమేల్మంగతమకమో నీయింపో
వీఁగక నన్నేలితి మీవేడుక యిట్లున్నది
(||pallavi||)
ĕṟim̐giṁchavayya nāgunela dām̐sevu
mĕṟasi yābĕgu nīgu menavāvai yunnadi
(||||)
muṁgiḍa mŏkkulu mŏkki mohamu nībaim̐ jalli
sĕṁgalisūbulam̐ jūsīm̐ jĕliya ninnu
sĕṁgaḍam̐ dŏlliḍibŏṁdo neseippaḍinestamā
iṁgidāgāramaide niḍuvalĕ nunnadi
(||||)
sĕlavula navvu navvi siggudom̐ dalavaṁchi
kaluvabūvula vesīm̐ gammaḍi ninnu
salabaṭṭi sĕnagīno saliga nīvichchidivo
talam̐sugŏṁṭe mīlo tagula miṭlunnadi
(||||)
mām̐ginamovi sūbi maṟam̐guna sanna sesi
kām̐giḍiṁliṁchugŏnī śhrī veṁkaḍeśha ninnu
dām̐gaga yalamelmaṁgadamagamo nīyiṁpo
vīm̐gaga nannelidi mīveḍuga yiṭlunnadi