ఎఱిఁగితి నిదివో మీ యిద్దరి తమకములు
(॥పల్లవి॥)
ఎఱిఁగితి నిదివో మీ యిద్దరి తమకములు
మొఱఁగులు నేరుతువే మున్నిటికంటెను
(॥ఎఱిఁగి॥)
చలివాసి యెదుటను సరసునిమోము చూచి
సెలవి నవ్వితివేలే చెలియా
కలువపువ్వుల వేసి కమ్మటి నప్పుడేమని
పలికితివే నీవు పంతములు మీరను
(॥ఎఱిఁగి॥)
చాయలకుఁ గొలువులో సతులెల్లఁ జూడఁగాను
చేయెత్తి మొక్కితివేలే చెలియా
ఆయములు కొనగోర నంటఁగా సన్నలు నీవు
సేయ నేర్చితివి యేల సేఁతలెక్కుడుగను
(॥ఎఱిఁగి॥)
వావిరి నోరెఁపాటి వసంతవల్లభఁడైన
శ్రీవేంకటేశునాలవే చెలియా
యీవేళ నిన్నేలినట్టే యెనసె నన్నితఁడును
వావి చెప్పనేలే యింక వరుసలతోడను
(||pallavi||)
ĕṟim̐gidi nidivo mī yiddari tamagamulu
mŏṟam̐gulu neruduve munniḍigaṁṭĕnu
(||ĕṟim̐gi||)
salivāsi yĕduḍanu sarasunimomu sūsi
sĕlavi navvidivele sĕliyā
kaluvabuvvula vesi kammaḍi nappuḍemani
paligidive nīvu paṁtamulu mīranu
(||ĕṟim̐gi||)
sāyalagum̐ gŏluvulo sadulĕllam̐ jūḍam̐gānu
seyĕtti mŏkkidivele sĕliyā
āyamulu kŏnagora naṁṭam̐gā sannalu nīvu
seya nersidivi yela sem̐talĕkkuḍuganu
(||ĕṟim̐gi||)
vāviri norĕm̐pāḍi vasaṁtavallabham̐ḍaina
śhrīveṁkaḍeśhunālave sĕliyā
yīveḽa ninnelinaṭṭe yĕnasĕ nannidam̐ḍunu
vāvi sĕppanele yiṁka varusaladoḍanu