Eravulu sadamaunaa yemdaamkane | kaanee

ఎరవులు సతమౌనా యెందాఁకనే । కానీ
Language

(॥పల్లవి॥)
ఎరవులు సతమౌనా యెందాఁకనే । కానీ
తరువాత నయ్యీఁగాక తరవెందాఁకనే

(॥॥)
తతిఁ దనయంతటనే తనకు లేనిమోహ-
మితరులు యెచ్చరించే దెందాఁకనే
పతిఁ బిలువకతొల్లే పైకొని వచ్చేరాక
సతుల నంపఁగ వచ్చె సట లెందాఁకనే

(॥॥)
మక్కువతోఁ దనంతనే మాటాడించనిమాట
యెక్కించి మీ రాడించే దెందాఁకనే
ఇక్కువ గరఁగి తానే యెదురుకొని కాఁగిలి
చిక్కినేఁ గొసరఁగాను చేరే దెందాకనే

(॥॥)
సంతతము నిదేపనై జంటవాయకుండేపొందు
ఇంత దలఁపించి కూడే దెందాఁకనే
చింతదీర మన్నించె శ్రీవేంకటేశుఁడు నన్ను
దొంతులాయఁ బులకలు దూరులెందాఁకానే

(||pallavi||)
ĕravulu sadamaunā yĕṁdām̐kane | kānī
taruvāda nayyīm̐gāga taravĕṁdām̐kane

(||||)
tadim̐ danayaṁtaḍane tanagu lenimoha-
midarulu yĕchchariṁche dĕṁdām̐kane
padim̐ biluvagadŏlle paigŏni vachcherāga
sadula naṁpam̐ga vachchĕ saḍa lĕṁdām̐kane

(||||)
makkuvadom̐ danaṁtane māḍāḍiṁchanimāḍa
yĕkkiṁchi mī rāḍiṁche dĕṁdām̐kane
ikkuva garam̐gi tāne yĕdurugŏni kām̐gili
sikkinem̐ gŏsaram̐gānu sere dĕṁdāgane

(||||)
saṁtadamu nidebanai jaṁṭavāyaguṁḍebŏṁdu
iṁta dalam̐piṁchi kūḍe dĕṁdām̐kane
siṁtadīra manniṁchĕ śhrīveṁkaḍeśhum̐ḍu nannu
dŏṁtulāyam̐ bulagalu dūrulĕṁdām̐kāne