Eravulu marilevu yevvarigini

ఎరవులు మరిలేవు యెవ్వరికిని
Language

(॥పల్లవి॥)
ఎరవులు మరిలేవు యెవ్వరికిని
సరస సల్లాపములు సమకొనునపుడు

(॥ఎర॥)
యియ్యకోలే వూఁకొంటే ఇన్ని విన్నవించవచ్చు
నెయ్యమైతే చనవులు నెరపవచ్చు
చెయ్యారాఁ జెనఁగితేను సిగ్గు విడిసించవచ్చు
తొయ్యలులకు నీవలె తొడఁగి లాలించతే

(॥ఎర॥)
చేకొని సమ్మతించితే చేఁతలన్నిఁ జేయవచ్చు
జోకయై పాయకుండితే చొక్కించవచ్చు
చేకొలఁదికి వచ్చితే చెనకి మెప్పించవచ్చు
యే కాంతకూ నీవలె యిచ్చగించి కూడితే

(॥ఎర॥)
వాలాయించితే రతుల వాడికలు చూపవచ్చు
మేలమాడితే నేరుపు మెరయవచ్చు
యీలీలనే శ్రీవేంకటేశు నన్ను నేలితివి
నీ లేమ నయిన నాకు నీవలె మన్నించితే

(||pallavi||)
ĕravulu marilevu yĕvvarigini
sarasa sallābamulu samagŏnunabuḍu

(||ĕra||)
yiyyagole vūm̐kŏṁṭe inni vinnaviṁchavachchu
nĕyyamaide sanavulu nĕrabavachchu
sĕyyārām̐ jĕnam̐gidenu siggu viḍisiṁchavachchu
tŏyyalulagu nīvalĕ tŏḍam̐gi lāliṁchade

(||ĕra||)
segŏni sammadiṁchide sem̐talannim̐ jeyavachchu
jogayai pāyaguṁḍide sŏkkiṁchavachchu
segŏlam̐digi vachchide sĕnagi mĕppiṁchavachchu
ye kāṁtagū nīvalĕ yichchagiṁchi kūḍide

(||ĕra||)
vālāyiṁchide radula vāḍigalu sūbavachchu
melamāḍide nerubu mĕrayavachchu
yīlīlane śhrīveṁkaḍeśhu nannu nelidivi
nī lema nayina nāgu nīvalĕ manniṁchide