ఎరవులు లేనిచోట యెట్టున్నా మేలే
(॥పల్లవి॥)
ఎరవులు లేనిచోట యెట్టున్నా మేలే
తరగని కోరికలు తారుకాణ గనక
(॥ఎర॥)
బిరుతునని నీతోను పెనఁగులాడినా మేలే
సొరిది మేనును మేము సోఁకుఁగనక
తెరలి సారె సారెకుఁ దిట్లాడినా మేలే
తొరలి నీపేరు నోరఁ దొట్టుకొనుఁ గనక
(॥ఎర॥)
పదరి నిన్ను జంకించి పగ చాటినా మేలే
కదిసి నామోము చూడఁగద్దు గనక
వుదుటున మారుమోమై వూరకలిగిని మేలే
యెదలోనఁ దలపోసి యింపురేఁగుఁగనక
(॥ఎర॥)
గక్కనఁ గాఁతాళించి కరము చాఁచినా మేలే
మక్కువటంటి కోపాలు మానుఁగనక
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁదు
దక్కెఁ బనులన్నీ నేలే తగులాయఁగనక
(||pallavi||)
ĕravulu lenisoḍa yĕṭṭunnā mele
taragani korigalu tārugāṇa ganaga
(||ĕra||)
birudunani nīdonu pĕnam̐gulāḍinā mele
sŏridi menunu memu som̐kum̐ganaga
tĕrali sārĕ sārĕgum̐ diṭlāḍinā mele
tŏrali nīberu noram̐ dŏṭṭugŏnum̐ ganaga
(||ĕra||)
padari ninnu jaṁkiṁchi paga sāḍinā mele
kadisi nāmomu sūḍam̐gaddu ganaga
vuduḍuna mārumomai vūragaligini mele
yĕdalonam̐ dalabosi yiṁpurem̐gum̐ganaga
(||ĕra||)
gakkanam̐ gām̐tāḽiṁchi karamu sām̐sinā mele
makkuvaḍaṁṭi kobālu mānum̐ganaga
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐du
dakkĕm̐ banulannī nele tagulāyam̐ganaga