Eravule nee gunaalu innaalla danagaanu

ఎరవులే నీ గుణాలు ఇన్నాళ్ళ దనకాను
Language

(॥పల్లవి॥)
ఎరవులే నీ గుణాలు ఇన్నాళ్ళ దనకాను
సరివచ్చె నాడుకొనే జవరాండ్ల మాటలు

(॥॥)
వెలవెట్టనివలపు వెలది నీపైఁ జల్లఁగా
నలువంకలా నీకు నవ్వులు గావా
మొలకచన్నులు మరి మోమున కెగరఁగాను
యెలమి సంతోసాలుగా కిఁక నెన్నఁడయ్యా

(॥॥)
పోరచి దెచ్చి విడేలు పొరుగాపె యియ్యఁగాను
సారె కిందరిలోనా చవులు గావా
తీరనిమోవితేనెలతీపు నీమోవి సోఁకఁగ
యీరీతి నీ భాగ్యమాయ నిన్నిటా మేలయ్యా

(॥॥)
పీటమీఁద నీకు నిట్టె పెండ్లికూఁతు రుండఁగాను
పాటించి ఇన్నిటా నీరపములే కావా
యీటున శ్రీవేంకటేశ ఇటు నన్ను నేలితివి
మీటాయ నీసుద్దులెల్లా మెచ్చాయనయ్యా

(||pallavi||)
ĕravule nī guṇālu innāḽḽa danagānu
sarivachchĕ nāḍugŏne javarāṁḍla māḍalu

(||||)
vĕlavĕṭṭanivalabu vĕladi nībaim̐ jallam̐gā
naluvaṁkalā nīgu navvulu gāvā
mŏlagasannulu mari momuna kĕgaram̐gānu
yĕlami saṁtosālugā kim̐ka nĕnnam̐ḍayyā

(||||)
porasi dĕchchi viḍelu pŏrugābĕ yiyyam̐gānu
sārĕ kiṁdarilonā savulu gāvā
tīranimovidenĕladību nīmovi som̐kam̐ga
yīrīdi nī bhāgyamāya ninniḍā melayyā

(||||)
pīḍamīm̐da nīgu niṭṭĕ pĕṁḍligūm̐tu ruṁḍam̐gānu
pāḍiṁchi inniḍā nīrabamule kāvā
yīḍuna śhrīveṁkaḍeśha iḍu nannu nelidivi
mīḍāya nīsuddulĕllā mĕchchāyanayyā