Eravulavaarevvaru yimdulo neegu

ఎరవులవారెవ్వరు యిందులో నీకు
Language

(॥పల్లవి॥)
ఎరవులవారెవ్వరు యిందులో నీకు
విరివికాఁడవు నీవు విచ్చేయవయ్యా

(॥ఎర॥)
తగవెల్ల నీయందె తగిలించినదిగాన
మగువలతోఁ జెలి మాటాడదు
వగయెఱఁగ కిందాఁకా వలలబడుండితిమి
అగడు నీవల్లఁ దీరు నాడకు రావయ్యా

(॥ఎర॥)
పాయమెల్లా నీకే పాలుపట్టినదిగాన
వేయైనా తనగుట్టు వెళ్ల వేయదు
చాయ దెలియ కిందాఁకా సరితలు చూచితిమి
నీయందే చిక్కులు వాసీ నిక్కి చూడవయ్యా

(॥ఎర॥)
వొరసి కాఁగిలి నీకే వొప్పగించినదిగాన
సొరిది నెవ్వరిబుద్ది చొరనియ్యదు
యిరవై శ్రీ వేంకటేశ యీపె నిట్టె కూడితివి
వెరవు నీవల్ల నుంది విడెమియ్యవయ్యా

(||pallavi||)
ĕravulavārĕvvaru yiṁdulo nīgu
virivigām̐ḍavu nīvu vichcheyavayyā

(||ĕra||)
tagavĕlla nīyaṁdĕ tagiliṁchinadigāna
maguvaladom̐ jĕli māḍāḍadu
vagayĕṟam̐ga kiṁdām̐kā valalabaḍuṁḍidimi
agaḍu nīvallam̐ dīru nāḍagu rāvayyā

(||ĕra||)
pāyamĕllā nīge pālubaṭṭinadigāna
veyainā tanaguṭṭu vĕḽla veyadu
sāya dĕliya kiṁdām̐kā saridalu sūsidimi
nīyaṁde sikkulu vāsī nikki sūḍavayyā

(||ĕra||)
vŏrasi kām̐gili nīge vŏppagiṁchinadigāna
sŏridi nĕvvaribuddi sŏraniyyadu
yiravai śhrī veṁkaḍeśha yībĕ niṭṭĕ kūḍidivi
vĕravu nīvalla nuṁdi viḍĕmiyyavayyā