ఎరవులదానివలె నెందు వొయ్యేవే ఆత
(॥పల్లవి॥)
ఎరవులదానివలె నెందు వొయ్యేవే ఆత-
నిరవులు వెదకవే యేమి సేసివో
(॥ఎరవుల॥)
కంకణాల చేతుల కదల నూఁచుకొంటాను
యింకనిచెమటలతో నెందు వొయ్యేవే
అంకెల నీయింటికి నాతఁడె విచ్చేసె
యింకా రాఁడా వెర గయ్యీ నెంతఁ బోయనో
(॥ఎరవుల॥)
సెలవుల నవ్వుకొంటా చెంపలఁ దురుము జార
యెలమి నసురుసు రై యెందు వొయ్యేవే
కొలఁది లేనిసొమ్ములు కొంట వచ్చె నీకు నిట్టె
యెలయించి నాతోఁ జెప్పి యేడ నున్నాఁడో
(॥ఎరవుల॥)
బంగారు పాదాలతోడ పట్టుచీర కొంగ జార
యింగితాల గాన రాఁగా నెందు వోయ్వేవే
అంగన శ్రీవెంకటేశుఁ డప్పుడె నిన్నుఁ గూడెనో
రంగై నీ వెంటనె వచ్చే రాఁపుల వీఁడు గదే
(||pallavi||)
ĕravuladānivalĕ nĕṁdu vŏyyeve āda-
niravulu vĕdagave yemi sesivo
(||ĕravula||)
kaṁkaṇāla sedula kadala nūm̐sugŏṁṭānu
yiṁkanisĕmaḍalado nĕṁdu vŏyyeve
aṁkĕla nīyiṁṭigi nādam̐ḍĕ vichchesĕ
yiṁkā rām̐ḍā vĕra gayyī nĕṁtam̐ boyano
(||ĕravula||)
sĕlavula navvugŏṁṭā sĕṁpalam̐ durumu jāra
yĕlami nasurusu rai yĕṁdu vŏyyeve
kŏlam̐di lenisŏmmulu kŏṁṭa vachchĕ nīgu niṭṭĕ
yĕlayiṁchi nādom̐ jĕppi yeḍa nunnām̐ḍo
(||ĕravula||)
baṁgāru pādāladoḍa paṭṭusīra kŏṁga jāra
yiṁgidāla gāna rām̐gā nĕṁdu voyveve
aṁgana śhrīvĕṁkaḍeśhum̐ ḍappuḍĕ ninnum̐ gūḍĕno
raṁgai nī vĕṁṭanĕ vachche rām̐pula vīm̐ḍu gade