Eravula kobam bim(pambim?)kanela

ఎరవుల కోపఁ బిఁ(పంబిఁ?)కనేల
Language

(॥పల్లవి॥)
ఎరవుల కోపఁ బిఁ(పంబిఁ?)కనేల
తెరమఱఁగున నిఁకఁ దిరుగఁగ వలదే

(॥॥)
చెలియ నీనగవు సెలవుల నుండఁగ
యెలమి మారుమొగ మిఁకఁ దగదే
కలిగినయాసలు కన్నుల నుండఁగ
చలముల బొమ్మల జంకెన దగదే

(॥॥)
ననుపులమాఁటలు నాలుక నుండఁగ
పెనఁగేటి బిగువులు పెంచకువే
చెనకేటి తమకము చేతుల నుండఁగ
యెనలేనిజగడ మిఁకఁ బేర్చకువే

(॥॥)
కరఁగిన భావము కాఁగిట నుండఁగ
పరగేటి మోనము పనిలేదే
యిరవుగ శ్రీ వేంకటేశుఁడఁ గూడితి
సరి వెనకటి వెంచఁగఁ బనిలేదే

(||pallavi||)
ĕravula kobam̐ bim̐(paṁbim̐?)kanela
tĕramaṟam̐guna nim̐kam̐ dirugam̐ga valade

(||||)
sĕliya nīnagavu sĕlavula nuṁḍam̐ga
yĕlami mārumŏga mim̐kam̐ dagade
kaliginayāsalu kannula nuṁḍam̐ga
salamula bŏmmala jaṁkĕna dagade

(||||)
nanubulamām̐ṭalu nāluga nuṁḍam̐ga
pĕnam̐geḍi biguvulu pĕṁchaguve
sĕnageḍi tamagamu sedula nuṁḍam̐ga
yĕnalenijagaḍa mim̐kam̐ bersaguve

(||||)
karam̐gina bhāvamu kām̐giḍa nuṁḍam̐ga
parageḍi monamu panilede
yiravuga śhrī veṁkaḍeśhum̐ḍam̐ gūḍidi
sari vĕnagaḍi vĕṁcham̐gam̐ banilede