ఎరవుల దానివలె నేమి మమ్ము నడిగేవు
(॥పల్లవి॥)
ఎరవుల దానివలె నేమి మమ్ము నడిగేవు
సరసమాడి విభుని చనవు చేకోరాదా
(॥॥)
అంకెల నాతనిమీఁద నప్పుడు నీవు చల్లిన
జంకెన చూపులే కావా చవి సేసెను
పొంకమై మారుకు మారు పూఁచి కుమ్మరించినట్టి
వంకలమాటలే కావా వలపు వుట్టించెను
(॥॥)
వెలలేక పతితోను వేడుకలు వుట్టించిన
సెలవినవ్వులే కావా చిమ్మి రేఁచెను
చలపట్టి యొండొరుల సరికి బేసికిఁ జేసే
పెలుచు సన్నలే కావా ప్రియాలు వుట్టించెను
(॥॥)
శ్రీవేంకటేశ్వరుని సిగ్గుదేరఁ గూడినట్టి
నీ వాఁడి చన్నులే కావా నెరవేర్చెను
తావుకొని లోలోని తమకములొనరించే
భావపు రతులే కావా పంతములందించెను.
(||pallavi||)
ĕravula dānivalĕ nemi mammu naḍigevu
sarasamāḍi vibhuni sanavu segorādā
(||||)
aṁkĕla nādanimīm̐da nappuḍu nīvu sallina
jaṁkĕna sūbule kāvā savi sesĕnu
pŏṁkamai mārugu māru pūm̐si kummariṁchinaṭṭi
vaṁkalamāḍale kāvā valabu vuṭṭiṁchĕnu
(||||)
vĕlalega padidonu veḍugalu vuṭṭiṁchina
sĕlavinavvule kāvā simmi rem̐sĕnu
salabaṭṭi yŏṁḍŏrula sarigi besigim̐ jese
pĕlusu sannale kāvā priyālu vuṭṭiṁchĕnu
(||||)
śhrīveṁkaḍeśhvaruni sigguderam̐ gūḍinaṭṭi
nī vām̐ḍi sannule kāvā nĕraversĕnu
tāvugŏni loloni tamagamulŏnariṁche
bhāvabu radule kāvā paṁtamulaṁdiṁchĕnu.