Eravu sesugonevu yimkaa nelaa

ఎరవు సేసుకొనేవు యింకా నేలా
Language

(॥పల్లవి॥)
ఎరవు సేసుకొనేవు యింకా నేలా
సిరసు నీవు వంచితే చేఁత లెల్ల మానువా

(॥ఎరవు॥)
సేసకొప్పుతోడిది చెమటముత్యాలది
సేసిన నీ పొందు మాతోఁ జెప్పుకొన్నది
పూసినజవ్వాదిపూఁత బుగులుకొనఁ బయ్యద
వేసిన వల్లెవాటుతో వేలఁ జూపీ నిన్నునూ

(॥ఎరవు॥)
దొరతనములది యేతుల చిట్లుగందారిది
మురిపేన నీ దిక్కు మొక మైనది
సురతాంతమున నీ సోఁకినగురుతు లెల్ల
పరగఁ జెలుల కెల్ల బయలు సేసీని

(॥ఎరవు॥)
కన్నుల మొక్కులది గయ్యాళి చేఁతలది
తన్నుఁ దానె నిన్నుఁ జూచి తనియనిది
యిన్నిటా శ్రీవెంకటేశ యిటు నీవు గూడఁగాను
పన్ని నీ పరవుమీఁదఁ బవళించినది

(||pallavi||)
ĕravu sesugŏnevu yiṁkā nelā
sirasu nīvu vaṁchide sem̐ta lĕlla mānuvā

(||ĕravu||)
sesagŏppudoḍidi sĕmaḍamutyāladi
sesina nī pŏṁdu mādom̐ jĕppugŏnnadi
pūsinajavvādibūm̐ta bugulugŏnam̐ bayyada
vesina vallĕvāḍudo velam̐ jūbī ninnunū

(||ĕravu||)
dŏradanamuladi yedula siṭlugaṁdāridi
muribena nī dikku mŏga mainadi
suradāṁtamuna nī som̐kinagurudu lĕlla
paragam̐ jĕlula kĕlla bayalu sesīni

(||ĕravu||)
kannula mŏkkuladi gayyāḽi sem̐taladi
tannum̐ dānĕ ninnum̐ jūsi taniyanidi
yinniḍā śhrīvĕṁkaḍeśha yiḍu nīvu gūḍam̐gānu
panni nī paravumīm̐dam̐ bavaḽiṁchinadi