ఎరవు సతమవునా యెప్పుడు నేము నేమే
(॥పల్లవి॥)
ఎరవు సతమవునా యెప్పుడు నేము నేమే
మురిపెపు టాకెఁ గని మొగమోడితివి
(॥॥)
మగువ కప్రము నోట మాటలాడీ వినవయ్య
వెగటైననేమేమన్నా వినవైతివి
బిగి శుంగరపువేలఁ బిలిచీఁ బోవయ్యా
జిగి నేము యెంత విలిచినా రావైతివి
(॥॥)
మొనగోరిచేత నాకె మొక్కీఁ జేకొనవయ్య
పనివడి మాతోనే పరాకైతివి
ననుపున నాకె నీతో నవ్వె నీవు నవ్వవయ్య
చనవున మానవ్వు చవిగాదు నీకు
(॥॥)
గందము వూసినమేనఁ గాఁగిలించీ మెచ్చవయ్య
ఇందుకుఁగా మాతోడ నింత సేసితివి
అందపు శ్రీ వేంకటేశ అలమేలమంగ నిన్నుఁ
బొందఁగాఁ జొక్కితివి మాబుద్దులు చవాయఁగా
(||pallavi||)
ĕravu sadamavunā yĕppuḍu nemu neme
muribĕbu ṭāgĕm̐ gani mŏgamoḍidivi
(||||)
maguva kapramu noḍa māḍalāḍī vinavayya
vĕgaḍainanememannā vinavaidivi
bigi śhuṁgarabuvelam̐ bilisīm̐ bovayyā
jigi nemu yĕṁta vilisinā rāvaidivi
(||||)
mŏnagoriseda nāgĕ mŏkkīm̐ jegŏnavayya
panivaḍi mādone parāgaidivi
nanubuna nāgĕ nīdo navvĕ nīvu navvavayya
sanavuna mānavvu savigādu nīgu
(||||)
gaṁdamu vūsinamenam̐ gām̐giliṁchī mĕchchavayya
iṁdugum̐gā mādoḍa niṁta sesidivi
aṁdabu śhrī veṁkaḍeśha alamelamaṁga ninnum̐
bŏṁdam̐gām̐ jŏkkidivi mābuddulu savāyam̐gā