Eravai pattaneramu yimtesi voosivaasulu

ఎరవై పట్టనేరము యింతేసి వూసివాసులు
Language

(॥పల్లవి॥)
ఎరవై పట్టనేరము యింతేసి వూసివాసులు
ఇరవై వుందాన నీకు నేమిసేతురా

(॥ఎర॥)
యెంత నే మాటలాడినా యెగసక్కెమే యనేవు
కొంతగొంత చూచితేను కోపమనేవు
వింతప్రియాలు సేసితే వెంగెములుగాఁ బట్టేవు
యెంతటివాఁడవు నిన్ను నేమనందురా

(॥ఎర॥)
అట్టే సిగ్గులు వడితే నలిగితి నే ననేవు
గట్టిగాఁ గొంగువట్టితే గయ్యాళనేవు
నెట్టుకొని నీవద్దనుంటే నే నిన్ను నమ్మకనేవు
యిట్టిమతకపువాని నెట్టు నే గెలుతురా

(॥ఎర॥)
అంకెకెల్లా వచ్చితేను అబ్బురము లివనేవు
సంకెలేక నవ్వితేను సటలనేవు
లంకెల శ్రీవేంకటేశ లలి నన్నుఁ గూడితివి
యింకా నిన్నప్పటిని యెట్టు గొసరుదురా

(||pallavi||)
ĕravai paṭṭaneramu yiṁtesi vūsivāsulu
iravai vuṁdāna nīgu nemisedurā

(||ĕra||)
yĕṁta ne māḍalāḍinā yĕgasakkĕme yanevu
kŏṁtagŏṁta sūsidenu kobamanevu
viṁtapriyālu seside vĕṁgĕmulugām̐ baṭṭevu
yĕṁtaḍivām̐ḍavu ninnu nemanaṁdurā

(||ĕra||)
aṭṭe siggulu vaḍide naligidi ne nanevu
gaṭṭigām̐ gŏṁguvaṭṭide gayyāḽanevu
nĕṭṭugŏni nīvaddanuṁṭe ne ninnu nammaganevu
yiṭṭimadagabuvāni nĕṭṭu ne gĕludurā

(||ĕra||)
aṁkĕgĕllā vachchidenu abburamu livanevu
saṁkĕlega navvidenu saḍalanevu
laṁkĕla śhrīveṁkaḍeśha lali nannum̐ gūḍidivi
yiṁkā ninnappaḍini yĕṭṭu gŏsarudurā