ఎఱఁ(ఱిఁ?)గించవే నాకు నిట్టె వూరకుండేఁగాని
(॥పల్లవి॥)
ఎఱఁ(ఱిఁ?)గించవే నాకు నిట్టె వూరకుండేఁగాని
గుఱుతు దెలుసుకొని గుట్టుసేసుకొనేను
(॥ఎఱఁ॥)
చెలికత్తెలకు నేల సిగ్గులు మూఁటగట్ట
అలరి దేవులకైతే నమరుఁగాక
కొలువులో నీవేల కోరి తలవంచేవే
నెలవై యాతనిపొందు నీకూఁ గొంత గలదో
(॥ఎఱఁ॥)
పొదరుగుదానికినేల బువ్వానఁ గూచుఁడ
గరిమితో సమ్మందము గలితేగాక
సరసుఁ డారఁగించఁగా సంగడిఁ గూచుంటివేమే
అరయ నీకిట్టె తొల్లి నలనా(వా?) టు గలదో
(॥ఎఱఁ॥)
కెలనిమగువకేల కెరలి సరసమాడ
లలి మఱఁదల నాకెలాఁగౌగాక
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశుఁడు
కలసె నన్ను నీకూఁ గారణము గలదో
(||pallavi||)
ĕṟam̐(ṟim̐?)giṁchave nāgu niṭṭĕ vūraguṁḍem̐gāni
guṟudu dĕlusugŏni guṭṭusesugŏnenu
(||ĕṟam̐||)
sĕligattĕlagu nela siggulu mūm̐ṭagaṭṭa
alari devulagaide namarum̐gāga
kŏluvulo nīvela kori talavaṁcheve
nĕlavai yādanibŏṁdu nīgūm̐ gŏṁta galado
(||ĕṟam̐||)
pŏdarugudāniginela buvvānam̐ gūsum̐ḍa
garimido sammaṁdamu galidegāga
sarasum̐ ḍāram̐giṁcham̐gā saṁgaḍim̐ gūsuṁṭiveme
araya nīgiṭṭĕ tŏlli nalanā(vā?) ṭu galado
(||ĕṟam̐||)
kĕlanimaguvagela kĕrali sarasamāḍa
lali maṟam̐dala nāgĕlām̐gaugāga
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhum̐ḍu
kalasĕ nannu nīgūm̐ gāraṇamu galado