ఎఱఁగుదు నిదె విడె మిందవయ్యా
(॥పల్లవి॥)
ఎఱఁగుదు నిదె విడె మిందవయ్యా
వెరగాయ వలపులు వేగిరమే లిపుడు
(॥ఎఱుఁ॥)
పచ్చిదేరీ మోవులను పాలుగారీ చెక్కులను
రచ్చకెక్కె నీబతుకు రావయ్యా
నిచ్చ నిచ్చ కొత్తలాయ నిన్ను నేమీనన నిఁక
విచ్చనవిళ్లేకాక వెఱుపేల ఇఁకను
(॥ఎఱుఁ॥)
సిగ్గుదేరీ మోహమునను చెమరించీ నొసలను
యెగ్గులేదు నీకు మొక్కె మియ్యకోవయ్యా
వొగ్గితి మిన్నిటికిని వొరసి నే నేమనే
నిగ్గులు దేరుటేకాక నేరమేది యిందును
(॥ఎఱుఁ॥)
చొప్పులెత్తి నీవురము సొంపుదేరెఁ బులకల
కొప్పువీడె వద్దనిట్టే కూరుచుండవయ్యా
అప్పఁడ శ్రీవేంకటేశ అన్నిటా నన్నుఁ గూడితిఁ
వుప్పతిల్లు సంతోసాలే వొనగూడె మనకు
(||pallavi||)
ĕṟam̐gudu nidĕ viḍĕ miṁdavayyā
vĕragāya valabulu vegirame libuḍu
(||ĕṟum̐||)
pachchiderī movulanu pālugārī sĕkkulanu
rachchagĕkkĕ nībadugu rāvayyā
nichcha nichcha kŏttalāya ninnu nemīnana nim̐ka
vichchanaviḽlegāga vĕṟubela im̐kanu
(||ĕṟum̐||)
sigguderī mohamunanu sĕmariṁchī nŏsalanu
yĕgguledu nīgu mŏkkĕ miyyagovayyā
vŏggidi minniḍigini vŏrasi ne nemane
niggulu deruḍegāga neramedi yiṁdunu
(||ĕṟum̐||)
sŏppulĕtti nīvuramu sŏṁpuderĕm̐ bulagala
kŏppuvīḍĕ vaddaniṭṭe kūrusuṁḍavayyā
appam̐ḍa śhrīveṁkaḍeśha anniḍā nannum̐ gūḍidim̐
vuppadillu saṁtosāle vŏnagūḍĕ managu