ఎఱఁగవుగాక మీఁదటెత్తు నీవు
(॥పల్లవి॥)
ఎఱఁగవుగాక మీఁదటెత్తు నీవు
కఱకరించి తిట్టితే కాదనఁగఁగలవా
(॥ఎఱ॥)
పొద్దు వోదా నీకదేమి పొరుఁగున నుండఁగాను
కొద్దిమీరఁ జెఇ చాఁచి కొంగువట్టేవు
సుద్దులెల్లా మావి నేను సూడు నిన్నుఁ బట్టితేను
వొద్దికఁ బంతిమియ్యక వూరకుండవచ్చునా
(॥ఎఱ॥)
యెగసక్కెమా నాతో ఇంటిలో నే నుండఁగాను
అగడైన మాటలెల్లా నాడవచ్చేవు
మొగమోటములు మాని మోవ నిన్ను నాడితేను
తగవున నూఁకొనక తలఁగఁగవచ్చునా
(॥ఎఱ॥)
చలములా నాతోను అలమేల్మంగా రమ్మని
నెలవై నీవురముపై నించుకొనేవు
సొలపులెల్లా మాని సొంపుగ శ్రీవేంకటేశ
కలసితి నిఁక నీవు కాదనఁగవచ్చునా
(||pallavi||)
ĕṟam̐gavugāga mīm̐daḍĕttu nīvu
kaṟagariṁchi tiṭṭide kādanam̐gam̐galavā
(||ĕṟa||)
pŏddu vodā nīgademi pŏrum̐guna nuṁḍam̐gānu
kŏddimīram̐ jĕi sām̐si kŏṁguvaṭṭevu
suddulĕllā māvi nenu sūḍu ninnum̐ baṭṭidenu
vŏddigam̐ baṁtimiyyaga vūraguṁḍavachchunā
(||ĕṟa||)
yĕgasakkĕmā nādo iṁṭilo ne nuṁḍam̐gānu
agaḍaina māḍalĕllā nāḍavachchevu
mŏgamoḍamulu māni mova ninnu nāḍidenu
tagavuna nūm̐kŏnaga talam̐gam̐gavachchunā
(||ĕṟa||)
salamulā nādonu alamelmaṁgā rammani
nĕlavai nīvuramubai niṁchugŏnevu
sŏlabulĕllā māni sŏṁpuga śhrīveṁkaḍeśha
kalasidi nim̐ka nīvu kādanam̐gavachchunā